Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicran Variant: భయపెడుతున్న పరిశోధనలు.. ఆ కేసుల్లో 90శాతం పైగా ఒమిక్రాన్‌వే..

తెలంగాణలో వస్తున్న కేసులు కోవిడ్ డేల్టా కేసులు కావా..? వైద్య నిపుణులు జరిపిన పరిశోధనల్లో ఏం తేలింది..? ఇందులో అధికంగా కొత్త వేరియంట్ కేసులేనా..? అవునంటున్నారు తెలంగాణ వైద్య అధికారులు.

Omicran Variant: భయపెడుతున్న పరిశోధనలు.. ఆ కేసుల్లో 90శాతం పైగా ఒమిక్రాన్‌వే..
Omicran Variant Cases
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 18, 2022 | 7:42 AM

Omicran Variant Cases in Telangana: తెలంగాణలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని వైద్య అధికారులు హెచ్చరిస్తున్నారు. మొత్తం నమోదవుతున్న కేసుల్లో దాదాపు 92 శాతం కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేనని బయట పెట్టారు. ఈ నెల 3, 4 తేదీల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 90 నమూనాలను ఆర్టీపీసీఆర్ పరీక్షలకు పంపించగా.. అందులో 7.7 శాతం మాత్రమే డెల్టా వేరియంట్‌ కేసులు ఉన్నాయని.. అయితే వాటిలో 92.3 శాతం ఒమిక్రాన్‌ పాజిటివ్‌‌ అని తేల్చి చెప్పారు. నిపుణులు చెప్పిన ఈ సంగతి ఇప్పుడు తెలంగాణ అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. ఒమిక్రాన్‌లోనూ ‘బిఎ1’కు చెందినవి 15, ‘బిఎ2’కు చెందినవి 64, ‘బి.1.1.529’కు చెందినవి 4గా తేలింది. అయితే వారు వెల్లడించిన లెక్కల ప్రకారం తెలంగాణలో ‘బిఎ2’ రకం ఒమ్రికాన్‌ వేరియంట్‌ ఎక్కువగా వ్యాప్తి చెందుతోందిన వైద్య నిపుణులు ఓ అంచానాకు వచ్చారు.

ఇది అతి పెద్ద సమస్య..  ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా మరో సమస్య పీడిస్తోంది. కొత్తగా వచ్చిన కోవిడ్ వెరియంట్ ఒమిక్రాన్‌ దెబ్బకు వైద్యసిబ్బందిలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వారం రోజులుగా పెద్ద సంఖ్యలోనే కొవిడ్‌ బారినపడుతున్నారు వైద్య సిబ్బంది. ఇప్పటి వరకూ గాంధీ ఆసుపత్రిలో 40 మంది పీజీ వైద్యవిద్యార్థులు, 38 మంది హౌజ్‌సర్జన్లు, 35 మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులు, ఆరుగురు అధ్యాపక సిబ్బంది మహమ్మారి బారిన పడగా ఉస్మానియాలో 71 మంది పీజీ వైద్యవిద్యార్థులతో పాటు 90 మంది సిబ్బంది, నిమ్స్‌లోనూ 70 మందికి పైగా వైద్యులు కరోనా కోరల్లో చిక్కుకున్నారు. ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో 9 మంది వైద్యసిబ్బందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కొవిడ్‌ సేవల్లో పాల్గొంటున్న వైద్యసిబ్బందికి 7 రోజుల క్వారంటైన్‌ విధానాన్ని తిరిగి ప్రవేశపెడుతూ డా.బి.నాగేందర్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్రంలో ప్రస్తుం యాక్టివ్ కేసులు ఆదివారం నుంచి సోమవారం వరకు రాష్ట్రంలో కొత్తగా 2,447 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 7,11,656కు చేరింది. కరోనా కోరల్లో చిక్కి మరో 3 మరణాలు సంభవించగా ఇప్పటి వరకూ 4,060 మంది కన్నుమూశారు. వైరస్‌ బారిన పడి చికిత్స పొందిన అనంతరం తాజాగా 2,295 మంది కోలుకోగా మొత్తంగా 6,85,399 మంది కోలుకున్నారు. ఈ నెల 17న సాయంత్రం 5.30 గంటల వరకూ నమోదైన కరోనా సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు సోమవారం వెల్లడించారు.

ఇవి కూడా చదవండి: Bone Health Tips: ఎముకలను బలహీనపరిచే అలవాట్లను మానేయండి.. వాటిని నేటి నుంచే మార్చుకోండి..

ఇప్పుడు మీ ఫోన్ వాకీ టాకీ మార్చుకోవచ్చు.. మైక్రోసాఫ్ట్ టీమ్స్‌లో కొత్త ఫీచర్.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..