విషాదం.. క్వారంటైన్‌ సెంటర్‌లో చేరిన 14 గంటలకే యువకుడి మృతి..

| Edited By:

Apr 28, 2020 | 3:51 PM

కరోనా కట్టడి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రజా రవాణా స్థంభించిపోయింది. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఉంది. అందులో నిత్యవసర సరకులకు కూడా మినహాయింపు కొనసాగుతోంది. అయితే ఎక్కడి వారు అక్కడే ఉండాలని.. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారు కూడా ఎక్కడికక్కడే ఉండాలని ఆదేశాలు జారీచేసింది ప్రభుత్వం. కానీ కొందరు మాత్రం అవన్నీ పట్టించుకోకుండా.. వారి వారి స్వస్థలాలకు కాలి నడకన ప్రయాణాలు చేస్తున్నారు. […]

విషాదం.. క్వారంటైన్‌ సెంటర్‌లో చేరిన 14 గంటలకే యువకుడి మృతి..
Follow us on

కరోనా కట్టడి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రజా రవాణా స్థంభించిపోయింది. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఉంది. అందులో నిత్యవసర సరకులకు కూడా మినహాయింపు కొనసాగుతోంది. అయితే ఎక్కడి వారు అక్కడే ఉండాలని.. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారు కూడా ఎక్కడికక్కడే ఉండాలని ఆదేశాలు జారీచేసింది ప్రభుత్వం. కానీ కొందరు మాత్రం అవన్నీ పట్టించుకోకుండా.. వారి వారి స్వస్థలాలకు కాలి నడకన ప్రయాణాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అనేక మంది ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు.

తాజాగా యూపీలో కూడా ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. శ్రావస్తి జిల్లా క్వారంటైన్‌ సెంటర్‌లో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ముంబై నుంచి తన గ్రామానికి కాలినడకన చేరుకున్నట్లు అతని కుటుంబ సభ్యలు తెలిపారు. ఈ సంఘటన మాలిపూర్ పీఎస్‌ పరిధిలోని మఠ్ఖన్వా గ్రామంలో చోటు చేసుకుంది. సదరు యువకుడు మహారాష్ట్ర నుంచి బహ్రాయిచ్‌ వెళ్లే మార్గంలో గ్రామానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే గ్రామంలో ఉన్న క్వారంటైన్‌ సెంటర్‌లో యువకుడిని ఉంచారు. అయితే సెంటర్‌లోకి వచ్చిన 14గంటలు కూడా గడవకముందే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో విషయం తెలుసుకున్న ఆరోగ్యశాఖ అధికారులు, పోలీసులు క్వారంటైన్‌ సెంటర్‌కి చేరుకున్నారు. ఆ యువకుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.