వలస కూలీల వెతలు.. లాక్ డౌన్ మిగిలిస్తున్న నిజాలు

కరోనావైరస్ లాక్ డౌన్ కాలంలో వలస కూలీల వెతలు ఇన్నీ అన్ని కావు.  లాక్ డౌన్ నేపథ్యంలో తాము ఉంటున్న ప్రాంతాల్లో పట్టెడన్నానికి నోచుకోక తమ తమ కుటుంబాలతో స్వస్థలాలకు బయలుదేరుతున్నారు. రైళ్లు,ట్రక్కులు, బస్సులు..ఏది తమను గమ్యం చేరుస్తుందో తెలియకున్నా.. ఆ వాహనాన్నే శరణు వేడుతున్నారు. ఛత్తీస్ గడ్ లో ఓ నిరుపేద కుటుంబం అప్పటికే కిక్కిరిసి ఉన్న ఓ ట్రక్కులో ఎక్కేందుకు పడుతున్న పాట్లను కెమెరామెన్లు తమ కెమెరాల్లో ఎక్కించారు. ఒక చేత్తో చంటిబిడ్డను, మరో […]

వలస కూలీల వెతలు.. లాక్ డౌన్ మిగిలిస్తున్న నిజాలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 12, 2020 | 5:04 PM

కరోనావైరస్ లాక్ డౌన్ కాలంలో వలస కూలీల వెతలు ఇన్నీ అన్ని కావు.  లాక్ డౌన్ నేపథ్యంలో తాము ఉంటున్న ప్రాంతాల్లో పట్టెడన్నానికి నోచుకోక తమ తమ కుటుంబాలతో స్వస్థలాలకు బయలుదేరుతున్నారు. రైళ్లు,ట్రక్కులు, బస్సులు..ఏది తమను గమ్యం చేరుస్తుందో తెలియకున్నా.. ఆ వాహనాన్నే శరణు వేడుతున్నారు. ఛత్తీస్ గడ్ లో ఓ నిరుపేద కుటుంబం అప్పటికే కిక్కిరిసి ఉన్న ఓ ట్రక్కులో ఎక్కేందుకు పడుతున్న పాట్లను కెమెరామెన్లు తమ కెమెరాల్లో ఎక్కించారు. ఒక చేత్తో చంటిబిడ్డను, మరో చేత్తో ఆ ట్రక్కు తాడును పట్టుకుని హడావుడిగా ఎక్కుతున్న ఓ వ్యక్తి తాలూకు దృశ్యమే ఇందుకు నిదర్శనం. 20 సెకండ్ల వీడియోలో బహుశా ఆ వ్యక్తి కుటుంబంలోని మహిళ కూడా నానా అవస్థలు పడుతూ ఆ వాహనాన్ని ఎక్కేందుకు పడిన శ్రమ ఇది.. ఈ వలస కూలీలంతా రాయ పూర్ నుంచి ఝార్ఖండ్ వెళ్తున్నారట..