కరోనాను జయించిన 36 రోజుల పసికందు..

దేశంలో కరోనా వైరస్ తీవ్రత తగ్గట్లేదు. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం వైరస్ ను కట్టడి చేసేందుకు శాస్త్రవేత్తలు విరుగుడు కనిపెట్టే పనిలో పడ్డారు. ఈ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు వృద్దులు, పిల్లలు ఇంటికే పరిమితి కావాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. వీరిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని కాబట్టి.. వీరే ఎక్కువగా వైరస్ బారిన పడతారని.. వైద్యులు ఈ మేరకు సలహా ఇచ్చారు. ఇదిలా […]

కరోనాను జయించిన 36 రోజుల పసికందు..
Follow us

|

Updated on: May 28, 2020 | 1:37 PM

దేశంలో కరోనా వైరస్ తీవ్రత తగ్గట్లేదు. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం వైరస్ ను కట్టడి చేసేందుకు శాస్త్రవేత్తలు విరుగుడు కనిపెట్టే పనిలో పడ్డారు. ఈ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు వృద్దులు, పిల్లలు ఇంటికే పరిమితి కావాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. వీరిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని కాబట్టి.. వీరే ఎక్కువగా వైరస్ బారిన పడతారని.. వైద్యులు ఈ మేరకు సలహా ఇచ్చారు. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో 36 రోజుల పసికందు కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో తల్లి చెంతకు చేరింది. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. ముంబైలో 36 రోజుల బాలుడికి కరోనా సోకగా.. తల్లిదండ్రులు ఆ బాబును సియాన్ పిల్లల ఆసుపత్రిలో చేరిపించారు. అక్కడి వైద్యులు కోవిడ్ 19 నిబంధనల ప్రకారం చిన్నారికి ప్రత్యేకంగా చికిత్స అందించి కంటికి రెప్పలా చూసుకున్నారు. దాదాపు 15 రోజుల పాటు చికిత్స అనంతరం ఆ బాలుడికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. నెగటివ్ రిపోర్టు వచ్చింది. పూర్తిగా కోలుకున్న తర్వాత..ఆసుపత్రి నుంచి చిన్నారిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు. కాగా, బాలుడు కరోనాను జయించడంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు. తల్లి బాలుడిని ఎత్తుకుని ఆసుపత్రికి బయటకు వస్తున్న వీడియోను మహారాష్ట్ర సీఎంఓ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..