Corona: మహారాష్ట్రలో కరోనా విలయతాండవం.. 24గంటల్లో అరలక్ష మార్కుకు చేరువలో కేసులు..

|

Apr 03, 2021 | 10:31 PM

Maharashtra Coronavirus cases: మహారాష్ట్రలో కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. రాష్ట్రంలో కేసుల

Corona: మహారాష్ట్రలో కరోనా విలయతాండవం.. 24గంటల్లో అరలక్ష మార్కుకు చేరువలో కేసులు..
Corona Positive Cases
Follow us on

Maharashtra Coronavirus cases: మహారాష్ట్రలో కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళన మరింత తీవ్రమైంది. తాజాగా అరలక్ష మార్కుకు చేరువలో కేసులు నమోదయ్యాయి. శుక్రవారం నుంచి శనివారం సాయంత్రం వరకు 24 గంటల్లో కొత్తగా 49,447 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 277 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు మహారాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం రాత్రి హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,53,523 కి పెరగగా.. మరణించిన వారి సంఖ్య 55,656 కి చేరింది.

ఇదిలాఉంటే.. గత 24 గంటల్లో 37,821 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 24,95,315 కి చేరినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం మహారాష్ట్ర వ్యాప్తంగా 4,01,172 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా.. మహారాష్ట్రలోని పూణే, ముంబైలో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో అత్యధికంగా ముంబై మహానగరంలో నమోదయ్యాయి. గత 24 గంటల్లో ముంబైలో 9,090 కేసులు నమోదు కాగా.. 27 మంది మరణించారు. దేశంలో కరోనా కేసులు, మరణాల పరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతోంది.

మహారాష్ట్రలో ఇప్పటికే.. పలు ప్రాంతాల్లో కఠినమైన లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూను సైతం అమలు చేస్తున్నారు. అయినప్పటికీ రాష్ట్రంలో కోవిడ్ కేసులు నిరంతరం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై శుక్రవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. పరిస్థితులు చేయిదాటేలా కనిపిస్తున్నాయని.. కఠినమైన నిర్ణయాలు తీసుకునేందుకు వెనకాడబోమని తెలిపారు. కేసుల సంఖ్య ఇలానే పెరిగితే.. రాష్ట్రంలో లాక్‌డౌన్ తప్పదంటూ పేర్కొన్నారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. అందరూ.. మాస్క్ ధరించాలని.. భౌతిక దూరం పాటించాలని కోరారు.

Also Read: