COVID-19: మహారాష్ట్రలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే..?

|

May 17, 2021 | 11:28 PM

Maharashtra Coronavirus cases: దేశవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం మూడు లక్షలకు పైగా కొత్త కేసులు, నాలుగు వేలకు పైగా

COVID-19: మహారాష్ట్రలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే..?
Maharashtra Corona
Follow us on

Maharashtra Coronavirus cases: దేశవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం మూడు లక్షలకు పైగా కొత్త కేసులు, నాలుగు వేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. కాగా.. దేశంలో కరోనా ప్రారంభం నాటినుంచి అత్యధికంగా మహారాష్ట్రలో కేసులు, మరణాలు నమోదైన విషయం తెలిసిందే. సెకండ్ వేవ్‌తో మహారాష్ట్ర అతలాకుతలమైంది. నిత్యం 60వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం దాదాపు నెల నుంచి లాక్‌డౌన్‌ను విధిస్తూ చర్యలు తీసుకుంటుంది. దీని ఫలితంగా అత్యధిక కేసులు నమోదయిన మహారాష్ట్రలో.. ఇప్పుడు కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది.

తాజాగా మహారాష్ట్రలో కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గత 24 గంటల్లో కొత్తగా 26,616 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 516 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాలతో మొత్తం కేసుల సంఖ్య 54,05,068 కి చేరగా.. మరణాల సంఖ్య 82,486 కు చేరింది. ఈ మేరకు మహరాష్ట్ర ఆరోగ్యశాఖ సోమవారం రాత్రి హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

గత 24 గంటల వ్యవధిలో కరోనా నుంచి 48,211 మంది కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 48,74,582 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,45,495 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇదిలాఉంటే.. ప్రస్తుతం మహారాష్ట్ర కంటే కూడా కర్ణాటకలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దేశంలో అత్యధికంగా కేసులు నమోదయ్యే స్థానంలో కర్ణాటక మొదటి స్థానంలో ఉండగా.. మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది.

Also Read:

Plasma Therapy: ఐసీఎంఆర్ కీలక నిర్ణయం.. కోవిడ్ చికిత్స నుంచి ప్లాస్మా థెరపి తొలగింపు

నారదా కేసు చల్లారిపోయిందా? బెంగాల్ మంత్రులకు బెయిల్ మంజూరు చేసిన సీబీఐ స్పెషల్ కోర్టు, బీజేపీపై నేతల ఫైర్