AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా ‘మహా’విలయం..నలుగురు ఎమ్మెల్యేలకు పాజిటివ్

భారత్‌లో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కరోనా వైరస్ కారణంగా గడిచిన 24 గంటల్లో దేశంలో 20,903 కొత్త వైరస్ కేసులు నమోదు కాగా, గడిచిన 24 గంటల్లో 379 మంది వైరస్ వల్ల మరణించారు. మరోవైపు పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు కోవిడ్ బారినపడుతున్నారు.

కరోనా ‘మహా’విలయం..నలుగురు ఎమ్మెల్యేలకు పాజిటివ్
Jyothi Gadda
|

Updated on: Jul 03, 2020 | 2:01 PM

Share

భారత్‌లో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కరోనా వైరస్ కారణంగా గడిచిన 24 గంటల్లో దేశంలో 20,903 కొత్త వైరస్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,25,544కి చేరింది. ఇందులో 2,27,439 యాక్టివ్ కేసులు ఉండగా.. 3,79, 892 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 379 మంది వైరస్ వల్ల మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 18,213కి చేరింది. కాగా, దేశంలోని మొత్తం క‌రోనా మ‌ర‌ణాల్లో దాదాపు 45శాతం ఒక్క మ‌హారాష్ట్రలోనే నమోదుకావడం ఆందోళ‌న క‌లిగిస్తోంది. మరోవైపు మహారాష్ట్రలో పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు కోవిడ్ బారినపడుతున్నారు.

మహారాష్ట్రలో పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు కోవిడ్ బారినపడుతున్నారు. ముఖ్యంగా థానే జిల్లాలో కోవిడ్ బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుండగా..జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ఓ మహిళ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. థానే జిల్లాకు చెందిన మహిళా ఎమ్మెల్యేకు కోవిడ్ పాజిటివ్‌గా తేలటంతో ఆ ఎమ్మెల్యే భర్తకు కూడా కోవిడ్ టెస్ట్ చేయించారు. దీంతో ఆయనకు కూడా కరోనా వైరస్ సంక్రమించినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో వారిద్దరిని హోం క్వారంటైన్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. గతంలో ఇదే జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ కరోనా వైరస్ బారినపడగా, థానే జిల్లాలోనే మరో మహిళా ఎమ్మెల్యేకు కరోనా సోకడంతో కోవిడ్ బారిన పడ్డ ఎమ్మెల్యేల సంఖ్య 4కు చేరింది. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య ల‌క్షా 86వేలు దాటింది. ప్ర‌స్తుతం అక్కడ క‌రోనా మ‌ర‌ణాల సంఖ్యకూడా ఆందోళనకర స్థాయికి చేరింది.

Follow Us
మర్చిపోకుండా రోజుకో చిలగడదుంప తినండి.. ఈ ఐదు అద్భుతమైన ప్రయోజనాలు
మర్చిపోకుండా రోజుకో చిలగడదుంప తినండి.. ఈ ఐదు అద్భుతమైన ప్రయోజనాలు
మెగా అభిమానం.. థియేటర్ వద్ద రామ్‌చరణ్‌కి గుడి కట్టిన ఫ్యాన్స్..
మెగా అభిమానం.. థియేటర్ వద్ద రామ్‌చరణ్‌కి గుడి కట్టిన ఫ్యాన్స్..
ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. 20 మంది దుర్మరణం
ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. 20 మంది దుర్మరణం
ఐపీఎల్ హిస్టరీలో ఈ 4 రికార్డులను మరోసారి రిపీట్ చేయడం కష్టమే
ఐపీఎల్ హిస్టరీలో ఈ 4 రికార్డులను మరోసారి రిపీట్ చేయడం కష్టమే
ఇదేం పుకార్లురా నాయనా.. అంతా అబద్దమే.. బంగారంపై అసలు నిజం ఇదే..!
ఇదేం పుకార్లురా నాయనా.. అంతా అబద్దమే.. బంగారంపై అసలు నిజం ఇదే..!
మహిళలకు పచ్చి బొప్పాయి వరప్రసాదం.. ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టే
మహిళలకు పచ్చి బొప్పాయి వరప్రసాదం.. ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టే
కాలేజీలో ఏడాదిగా మూసి ఉన్న గది తెరిచి చూస్తే షాక్!
కాలేజీలో ఏడాదిగా మూసి ఉన్న గది తెరిచి చూస్తే షాక్!
ఒకప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరో. క్యాటరింగ్ బిజినెస్‏లో..
ఒకప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరో. క్యాటరింగ్ బిజినెస్‏లో..
5300 ఏళ్ల నాటి మమ్మీలో ఇంకా జీవం! శాస్త్రవేత్తలకు ఓట్జీ షాక్
5300 ఏళ్ల నాటి మమ్మీలో ఇంకా జీవం! శాస్త్రవేత్తలకు ఓట్జీ షాక్
రోహిత్-విరాట్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ఎందుకో తెలుసా?
రోహిత్-విరాట్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ఎందుకో తెలుసా?