lockdown: ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కీలక నిర్ణయం.. లాక్‌డౌన్ గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే..?

|

Apr 30, 2021 | 12:01 PM

Maharashtra lockdown: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. దేశంలో అత్యధికంగా

lockdown: ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కీలక నిర్ణయం.. లాక్‌డౌన్ గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే..?
Maharashtra lockdown
Follow us on

Maharashtra lockdown: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలోనే కరోనా మహమ్మారి ఎక్కువగా వ్యాప్తిచెందుతోంది. కేసులు, మరణాల పరంగా దేశంలో మహారాష్ట్ర మొదటిస్థానంలో కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు వేలాదిగా పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. వైరస్ అదుపులోకి రావడంలేదు. ఈ మేరకు దాదాపు నెలనుంచి నైట్ కర్ఫ్యూను ఆ తర్వాత లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ ఆంక్షలను మరో 15 రోజులపాటు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది.

కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా మరో 15 రోజుల పాటు ఈ ఆంక్షలను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే అమలులో ఉన్న ఆంక్షలు మరో 15 రోజులపాటు కొనసాగుతాయని ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు గురువారం క్యాబినేట్ కూడా సమావేశమైంది. కాగా.. క‌రోనా విస్తృతి నేప‌థ్యంలో ఏప్రిల్ 21న బ్రేక్ ది చెయిన్‌ క్యాంపెయిన్ కింద రాష్ట్ర‌వ్యాప్తంగా మే 1 వ‌ర‌కు లాక్‌డౌన్ త‌ర‌హా క‌ఠిన ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో రేప‌టితో ఈ ఆంక్షల గ‌డువు ముగుస్తున్న కారణంగా.. తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

తాజాగా గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 66,159 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 771 మంది మృతి చెందారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 45,39,553 ఉండగా, మొత్తం మరణాలు 67,985కు చేరుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 6,70,301 యాక్టివ్ క‌రోనా కేసులు ఉన్నాయి.

Also Read:

ఆసుపత్రుల బయటే గంటల తరబడి కోవిడ్ రోగుల పడిగాపులు, బెడ్స్ లేక హాస్పిటల్స్ యాజమాన్యాల కలవరం

పశ్చిమ బెంగాల్ లో మేమే గెలుస్తాం, అధికారం మాదే, 200 సీట్లకు పైగా గ్యారంటీ , బీజేపీ ధీమా