మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచే నమోదవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో లక్ష మార్క్‌ను దాటేసింది. తాజాగా ఆదివారం నాడు 3,390 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,07,958కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 120 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 3950కి చేరింది. ఇక కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి 50978 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రంలో పెరుగుతున్న కేసుల్లో అత్యధికంగా ముంబై నగరంలోనే నమోదవుతుండటం కలకలం రేపుతోంది.