గుడ్‌న్యూస్‌.. ఆ రేషన్‌ కార్డుదారులందరికీ.. ఇక బియ్యంతో పాటుగా..

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సామాన్య ప్రజానీకానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ప్రజలకు ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వం ఉచితంగా రేషన్ సరకులను అందజేస్తోంది. అయితే ఇది కేవలం వైట్‌ కలర్ రేషన్ కార్డుదారులకే ఇచ్చేది. అంతేకాకుండా.. నాన్‌ లోకల్ పీపుల్స్(వర్కర్స్‌)కి కూడా ఇచ్చింది. అయితే ఇప్పుడు మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తున్ నేపథ్యంలో దాదాపు అంతా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో మహా సర్కార్‌ ఇక నుంచి పింక్ రేషన్ కార్డుదారులకి కూడా […]

గుడ్‌న్యూస్‌.. ఆ రేషన్‌ కార్డుదారులందరికీ.. ఇక బియ్యంతో పాటుగా..

Edited By:

Updated on: Apr 25, 2020 | 4:41 PM

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సామాన్య ప్రజానీకానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ప్రజలకు ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వం ఉచితంగా రేషన్ సరకులను అందజేస్తోంది. అయితే ఇది కేవలం వైట్‌ కలర్ రేషన్ కార్డుదారులకే ఇచ్చేది. అంతేకాకుండా.. నాన్‌ లోకల్ పీపుల్స్(వర్కర్స్‌)కి కూడా ఇచ్చింది. అయితే ఇప్పుడు మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తున్ నేపథ్యంలో దాదాపు అంతా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో మహా సర్కార్‌ ఇక నుంచి పింక్ రేషన్ కార్డుదారులకి కూడా రేషన్‌ను సబ్సీడీ ధరలకు అందజేసేందుకు రెడీ అయ్యింది.

ఈ లాక్‌డౌన్ నేపథ్యంలో.. పింక్‌ కలర్ రేషన్ కార్డుదారులకు కూడా బియ్యం, గోధుమలను సబ్సిడీ ధరలకు అందించాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే నిర్ణయించారు. పింక్‌ రేషన్ కార్డున్న వారికి ఇక.. ఒక్కొక్కరికి కిలో ఎనిమిది రూపాయల చొప్పున 3కిలోల గోధుమలు, కిలో రూ.12చొప్పు రెండు కిలోల బియ్యం ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. మే, జూన్ నెలల్లో ఈ పింక్ కలర్ రేషన్ కార్డు దారులందరికీ సబ్సీడీ కింద సరకులను అందజేసేలా చూడాలని అధికారులను కోరారు. కాగా.. దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో అధికంగా మహారాష్ట్ర నుంచే నమోదయ్యాయి. అంతేకాదు మరణాల సంఖ్య కూడా ఇక్కడే నమోదైంది. ముఖ్యంగా ముంబై, పూణెలో పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది.