మహారాష్ట్రలో మళ్లీ విజృంభిస్తున్న కరోనావైరస్.. కఠిన నిర్ణయాలు తీసుకుంటాం: డిప్యూటీ సీఎం అజిత్ పవార్

Maharashtra Coronavirus: మహారాష్ట్రలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. శనివారం 4వేలకు పైగా కేసులు నమోదు కాగా.. గత 24గంటల్లో 3,365 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు గత కొన్నిరోజుల నుంచి 3వేలకు..

మహారాష్ట్రలో మళ్లీ విజృంభిస్తున్న కరోనావైరస్.. కఠిన నిర్ణయాలు తీసుకుంటాం: డిప్యూటీ సీఎం అజిత్ పవార్
corona deaths

Updated on: Feb 15, 2021 | 11:33 PM

Maharashtra Coronavirus: మహారాష్ట్రలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. శనివారం 4వేలకు పైగా కేసులు నమోదు కాగా.. గత 24గంటల్లో 3,365 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు గత కొన్నిరోజుల నుంచి 3వేలకు పైగా కేసులు నమోదవుతుండటంతో మహారాష్ట్రలోని ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కట్టడికి తమ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందంటూ డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు నిబంధనలను పాటించడం లేదని దీంతో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని అజిత్ పవార్ ఆవేదన వ్యక్తంచేశారు. పరిస్థితి దిగజారితే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని.. ప్రజలు నిబంధనలను పాటించాలని ఆయన హెచ్చరించారు. పలు జిల్లాల్లో ప్రజలు మాస్కులు లేకుండా నిబంధనలు పాటించకుండా బహిరంగంగా తీరుగుతున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఇదిలాఉంటే.. మహారాష్ట్రలో కరోనా కేసులు, మరణాల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా కరోనా కేసుల సంఖ్య 20 లక్షలు దాటింది. ఆదివారం నుంచి సోమవారం సాయంత్రం వరకు కొత్తగా 3,365 కరోనా కేసులు నమోదు కాగా.. 23 మంది మరణించారు. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,67,643 కు చేరగా.. మరణాల సంఖ్య 51,552 కి పెరిగింది. ఇప్పటివరకు ఈ మహమ్మరి నుంచి 19,78,708 మంది బాధితులు కోలుకున్నారని ప్రభుత్వం తెలిపింది. కాగా మొదటినుంచి మహారాష్ట్రలో భారీగా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. దీంతోపాటు దేశంలో కేసులు, మరణాల విషయంలో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉంది.

Also Read:

మందుబాబులు తస్మాత్ జాగ్రత్త.. అతిగా మద్యం సేవిస్తే డీఎన్ఏలో మార్పులు.. బెంగళూరు సైంటిస్టుల పరిశోధనలో వెల్లడి!

కోవిడ్ వ్యాక్సిన్‌పై కేంద్ర మంత్రి కీలక ప్రకటన.. వచ్చే రెండు మూడు వారాల్లో 50ఏళ్లు పైబడినవారికి టీకాః హర్షవర్ధన్