ఏప్రిల్ 15 తరువాత కూడా లాక్‌డౌన్ కంటిన్యూ?

| Edited By:

Mar 26, 2020 | 1:43 PM

ఇప్పుడు ఈ లాక్‌డౌన్ ఏప్రిల్ 15తో ముగియబోదని, ఆపై కూడా మరిన్ని రోజులు పొడిగించే అవకాశాలున్నాయని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ కార్యాలయ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ 21 రోజుల్లో వైరస్ వ్యాప్తికి అరికట్టే విషయంలో..

ఏప్రిల్ 15 తరువాత కూడా లాక్‌డౌన్ కంటిన్యూ?
Telangana Lockdown
Follow us on

కరోనా.. ఈ పేరు చెబితేనే ప్రపంచం చిగురుటాకులా వణికిపోతుంది. చైనాలో పుట్టిన ఈ వైరస్.. దేశాలన్నింటినీ చుట్టేస్తోంది. అంతేకాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నాం చేస్తోంది. దీంతో ప్రధాని మోదీ ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా 21 రోజులు లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఏప్రిల్ 15 వరకూ ఇంటి నుంచి బయటకు రావడానికి వీలు లేదు. బస్సులు, రైళ్లు, విమాన సర్వీసులను ఇప్పటికే బంద్ చేశారు. ఎక్కడి ప్రజలు అక్కడే ఉండాలని పేర్కొన్నారు. కరోనా వైరస్‌కి అడ్డుకట్ట వేయడానికి ఇదే మంచి మార్గమని, దీంతో అందరూ ఇళ్లకే పరిమితమవుతారు కాబట్టి.. వైరస్ తక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందని మోదీ అభిప్రాయ పడ్డారు.

అయితే ఇప్పుడు ఈ లాక్‌డౌన్ ఏప్రిల్ 15తో ముగియబోదని, ఆపై కూడా మరిన్ని రోజులు పొడిగించే అవకాశాలున్నాయని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ కార్యాలయ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ 21 రోజుల్లో వైరస్ వ్యాప్తికి అరికట్టే విషయంలో ఇండియా ఎంతవరకూ సక్సెస్ అవుతుందో.. ఓ అవగాహన వస్తుందన్నారు. అమెరికా, ఇటలీ, ఇరాన్ వంటి దేశాల్లో మాదిరిగా పెద్ద ఎత్తున మరణాలు సంభవించకుండా చూడాలన్న ఉద్ధేశంలో ఉన్న ప్రధాని.. సరైన చర్యలే తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు.

వైరస్ బాధితుల సంఖ్య వేలల్లోకి, లక్షల్లోకి చేరితే.. కనీస మౌలిక వైద్య సదుపాయాలు కూడా అందించే స్థితిలో భారత్ లేదని.. అందుకే ముందుగానే ప్రధాని పరిస్థితిని నియంత్రణలో ఉంచేందుకు ఈ లాక్‌డౌన్ ఉపకరిస్తుందని అన్నారు. ఒకవేళ కరోనా పాజిటివ్ కేసులు కనుగ పెరిగితే.. మరికొన్ని రోజులు ఈ లాక్‌డౌన్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి: 

కరోనా ఎఫెక్ట్: కమల్ హాసన్ ఉదార భావం.. తన ఇంటినే హాస్పిటల్‌గా మార్చేస్తారట

కరోనా వైరస్ తొందరగా వ్యాపించే ప్రదేశాలు ఇవే.. జాగ్రత్తగా ఉండండి!

తన కారును ఆపినందుకు యువతి హల్‌చల్.. పోలీసులను కొరికి.. రక్తం మీద ఊసి..

కరోనా విజృంభణ: టీఆర్ఎస్ నేతల కీలక నిర్ణయం.. రూ.500 కోట్ల విరాళం

కరోనా ఎఫెక్ట్: పెరిగిన కండోమ్స్, ఐపిల్స్ సేల్స్

సీఎం సహాయ నిధికి.. విరాళంగా ఎంపీ బాలశౌరి రూ.4 కోట్లు

ఎక్కడైనా రేట్లు పెంచారా.. ఈ నెంబర్‌కి ఒక్క కాల్ చేస్తే.. తిక్క కుదురుస్తారు

కరోనా నివారణకు.. తెలంగాణలో స్టెరిలైజేషన్..

బాత్రూమ్ క్లీన్ చేస్తూ.. బట్టలు ఉతుకుతున్న క్రికెటర్

లాక్‌డౌన్ టైంలో బరువు పెరగకుండా ఇలా కేర్ తీసుకోండి..

వాట్సాప్ బంద్ కావడంలేదు.. ఆ ఫేక్ వార్తలను నమ్మకండి..