AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైనా వ్యాక్సిన్ కనిపెట్టిందా..? క్లినికల్ ట్రయల్‌గా 5000 మందికి..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి తెలిసిందే. ఇప్పటికే ఈ వైరస్ 21వేల మందికి పైగా పొట్టన పెట్టుకుంది. అంతేకాదు.. మరో 5లక్షల మంది ఈ వైరస్ సోకి ఆస్పత్రి పాలయ్యారు. ఈ మహమ్మారి చైనాలోని వుహాన్ పట్టణంలో పురుడుపోసుకున్న విషయం తెలిసిందే. అయితే అక్కడి నుంచి అది ప్రపంచ దేశాలన్నింటికి వ్యాపించింది. దీనికి విరుగుడు మందు లేకపోవడంతో.. అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ప్రస్తుతం అన్ని దేశాలు ఈ కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనుగొనేందుకు […]

చైనా వ్యాక్సిన్ కనిపెట్టిందా..? క్లినికల్ ట్రయల్‌గా 5000 మందికి..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 26, 2020 | 1:51 PM

Share

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి తెలిసిందే. ఇప్పటికే ఈ వైరస్ 21వేల మందికి పైగా పొట్టన పెట్టుకుంది. అంతేకాదు.. మరో 5లక్షల మంది ఈ వైరస్ సోకి ఆస్పత్రి పాలయ్యారు. ఈ మహమ్మారి చైనాలోని వుహాన్ పట్టణంలో పురుడుపోసుకున్న విషయం తెలిసిందే. అయితే అక్కడి నుంచి అది ప్రపంచ దేశాలన్నింటికి వ్యాపించింది. దీనికి విరుగుడు మందు లేకపోవడంతో.. అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ప్రస్తుతం అన్ని దేశాలు ఈ కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనుగొనేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో చైనా ఇంతకు ముందే వ్యాక్సిన్ కనక్కున్నారా..? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం చైనాలో జరుగుతున్న  ఔషధ పరీక్షలను చూస్తే నిజమేనేమో అనిపిస్తోంది.

అక్కడి సైంటిస్టులు.. పలు ప్రయోగాలు చేపట్టిన అనంతరం.. కనిపెట్టిన ఓ వ్యాక్సిన్‌ను క్లినికల్ టెస్ట్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యాక్సినేషన్‌ను వివిద  దశల్లో చేపట్టనుండగా, మొదటి దశకోసం ఏకంగా 5 వేల మంది ప్రజలు స్వచ్ఛందంగా రిజిస్టర్‌ చేసుకున్నట్లు బీజింగ్‌ న్యూస్‌ వెల్లడించింది.  దీన్ని ఓపెన్‌ అండ్‌ డోస్‌ ఎస్కలేషన్‌ ఫస్ట్ స్టేజ్ గా పిలుస్తున్నారు.

ఆరోగ్యంగా ఉన్న 18–60 ఏళ్ల వయసు మధ్య ఉన్న వారికి ఈ వ్యాక్సిన్‌ ను క్లినికల్ ట్రయల్ కింద ఇవ్వనున్నారు. దీనికోసం చైనాలోని అకాడెమీ ఆఫ్‌ మిలిటరీ మెడికల్‌ సైన్సెస్‌ నిపుణులు.. దీనికి కావాల్సిన అనుమతులను ఈ నెల 16వ తేదీనే పొందినట్లు తెలుస్తోంది. ఈ పరిశోధనలు.. దాదాపు ఆర్నెళ్ల పాటుగా సాగనున్నట్లు వెల్లడించారు. వైరస్‌ వల్ల తీవ్రంగా ప్రభావితమైన హుబే ప్రావిన్స్‌లోని వుహాన్‌లోనే ఈ క్లినికల్ ట్రయల్‌ను కొనసాగించనున్నారు. ఫస్ట్ స్టేజ్ లోవ్యాక్సిన్‌ పొందిన వారిని.. 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచిన తర్వాత.. వారి వారి హెల్త్ కండిషన్స్ ను ఎప్పటికప్పుడు చెక్ చేయనున్నారు.

కాగా.. ఏప్రిల్‌ నెలాఖరు కల్లా ప్రీ–క్లినికల్‌  స్టేజ్ లను పూర్తి చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత