రైతులకు ఊరట.. లాక్‌డౌన్ వర్తించదు..

| Edited By:

Mar 28, 2020 | 12:30 PM

దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్ కారణంగా రైతులు ఇబ్బందిపడకుండా కేంద్ర ప్రభుత్వం వారికి ఊరట కల్పించింది. రైతులు, రైతు కూలీలకు నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి  భల్లా ఉత్తర్వులు జారీ చేశారు. పంట పొలాల్లో పనిచేసే రైతులు..

రైతులకు ఊరట.. లాక్‌డౌన్ వర్తించదు..
Follow us on

దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్ కారణంగా రైతులు ఇబ్బందిపడకుండా కేంద్ర ప్రభుత్వం వారికి ఊరట కల్పించింది. రైతులు, రైతు కూలీలకు నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి  భల్లా ఉత్తర్వులు జారీ చేశారు. పంట పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలకు లాక్‌డౌన్ వర్తించవని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు సంబంధించిన వ్యక్తుల నుంచి మినహాయింపును ఇస్తూ కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఎరువుల దుకాణాలు, ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు తయారు చేసి ప్యాకింగ్ చేసే యూనిట్లు, వ్యవసాయ యంత్రాలను అద్దెకు ఇచ్చే కేంద్రాలను లాక్‌డౌన్ నుంచి కేంద్రం మినహాయింపు ఇచ్చింది. కనీస మద్దతు ధరతో పాటు, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు చేపట్టే సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫై చేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీలు నిర్వహించే మండీ కూడా లాక్‌డౌన్ వర్తించదు. పనులు లేక సొంతూళ్లకు గుంపులుగా వెళ్తున్న వలస కార్మికులకు అండగా నిలవాలని, వారు ఉన్నచోటే ఆహారం, ఆశ్రయం కల్పించాలని కేంద్రం సూచించింది. అలాగే అత్యవసర సరుకులు, మందులను రవాణా చేసే ఈ కామర్స్ సంస్థలకు కూడా మినహాయింపు ఉంది.

ఇవి కూడా చదవండి: తిండి లేక గడ్డి తింటోన్న చిన్నారులు..

జబర్దస్త్‌లో కరోనా కలకలం.. ఇబ్బందుల్లో ఆర్టిస్టులు

‘కరోనా వైరస్’ అంటూ జర్నలిస్ట్‌కి వేధింపులు.. కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

కరోనా వచ్చిందని భయపడుతున్నారా.. ఇలా తెలుసుకోండి!

తెలంగాణలో రేషన్ బియ్యం నిలిపివేత.. ఇదే కారణం..

ఏ లక్షణాలు లేకున్నా కరోనా వచ్చింది.. హైదరాబాద్ కోవిడ్ బాధితుడు చెప్పిన షాకింగ్ నిజాలు

జగన్ ప్రభుత్వానికి పవన్ మరో డిమాండ్.. ఈఎమ్‌ఐ చెల్లింపులు పొడిగించాలని..

వైరల్ న్యూస్: కరోనా ఉంది నాన్నా.. బయటకెళ్లొద్దంటూ.. బుడ్డోడి ఆవేదన

ఏప్రిల్ 15 తరువాత కూడా లాక్‌డౌన్ కంటిన్యూ?

కరోనా ఎఫెక్ట్: పెరిగిన కండోమ్స్, ఐపిల్స్ సేల్స్