‘కరోనా వైరస్’ అంటూ జర్నలిస్ట్‌కి వేధింపులు.. కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

హైదరాబాద్‌లో ఓ యువతికి 'కరోనా వైరస్' అంటూ వేధింపులు ఎదురయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్‌కి చెందిన ఓ యువతి.. చైనీయులను పోలి ఉండటంతో పలువురు యుకులు ఆమెను వేధింపులకు గురి చేశారు. దీంతో తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియా..

'కరోనా వైరస్' అంటూ జర్నలిస్ట్‌కి వేధింపులు.. కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
Follow us

| Edited By:

Updated on: Mar 27, 2020 | 2:59 PM

హైదరాబాద్‌లో ఓ యువతికి ‘కరోనా వైరస్’ అంటూ వేధింపులు ఎదురయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్‌కి చెందిన ఓ యువతి.. చైనీయులను పోలి ఉండటంతో పలువురు యువకులు ఆమెను వేధింపులకు గురి చేశారు. దీంతో తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుని ఆవేదన వ్యక్తం చేసింది. యువతులకు కరోనా వైరస్‌తోనే కాదు.. ఇలాంటి వ్యక్తుల నుంచీ దాడులను ఎదుర్కోవలసి వస్తుందని చొప్పుకొచ్చింది. మెడికల్ షాపుకు వెళ్తున్న క్రమంలో 15 మంది యువకులు తనను కరోనా వైరస్.. అంటూ హేళన చేశారంటూ ఆరోపించింది. ఈశాన్య ప్రజలు కూడా ఈ దేశ ప్రజలేనన్న సంగతి గుర్తుంచుకోవాలని.. తననూ దేశ పౌరురాలిగా గుర్తించాలని తెలిపింది.

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేసి, చర్యలు తీసుకోవాలని కోరింది. ఆ యువతి ట్వీట్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇలాంటి ఘటనలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని.. నిందితులపై చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని కోరారు. అలాగే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా ప్రబలుతున్న సందర్భంగా అందరూ కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని ప్రజలకు విన్నవించారు. కాగా.. ఆ యువతి జర్నలిస్ట్ కావడం గమనార్హం.

ఇవి కూడా చదవండి: 

కరోనా వచ్చిందని భయపడుతున్నారా.. ఇలా తెలుసుకోండి!

తెలంగాణలో రేషన్ బియ్యం నిలిపివేత.. ఇదే కారణం..

ఏ లక్షణాలు లేకున్నా కరోనా వచ్చింది.. హైదరాబాద్ కోవిడ్ బాధితుడు చెప్పిన షాకింగ్ నిజాలు

జగన్ ప్రభుత్వానికి పవన్ మరో డిమాండ్.. ఈఎమ్‌ఐ చెల్లింపులు పొడిగించాలని..

వైరల్ న్యూస్: కరోనా ఉంది నాన్నా.. బయటకెళ్లొద్దంటూ.. బుడ్డోడి ఆవేదన

ఏప్రిల్ 15 తరువాత కూడా లాక్‌డౌన్ కంటిన్యూ?

కరోనా ఎఫెక్ట్: పెరిగిన కండోమ్స్, ఐపిల్స్ సేల్స్