కరోనా పరిస్థితుల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూను పొడిగించింది. ఇప్పటికే విధించిన కర్ఫ్యూ గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సహా పలువురు ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో జూన్ 10 వరకు కర్ఫ్యూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సడలింపు, లాక్ డౌన్ వేళలు యదాతధంగా కొనసాగింపుకు సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ప్రస్తుతం ఉన్నట్లే ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూ మినహాయింపు ఉంటుంది. సడలింపు సమయంలో కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.
మరో పక్క ఆనందయ్య మందుపై సీఎంకు తది నివేదికను ఆయుష్ కమిషనర్ రాములు సమర్పించారు. కంట్లో వేసే డ్రాప్స్ తప్ప ఆనందయ్య ఇస్తున్న మందులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కె అనే మందును కూడా కమిటీ ముందు చూపించనందున దీనికి నిరాకరించారు. ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్ మందులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సీసీఆర్‌ఏఎస్ నివేదిక ప్రకారం నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. కంట్లో వేసే మందుపై ఇంకా నివేదికలు రావాల్సి ఉంది. ఆనందయ్య ఇస్తున్న మిగిలిన మందుల వల్ల హాని లేదని నివేదికలు తేల్చాయి. సీసీఆర్‌ఏఎస్ నివేదిక ప్రకారం ఆనందయ్య మందు వాడితే హాని లేదని నివేదికలు పేర్కొన్నాయి. ఆనందయ్య మందు వాడితే కొవిడ్ తగ్గుతుందనడానికి నిర్ధారణలు లేవని నివేదికలు పేర్కొన్నాయి. కంట్లో వేసే డ్రాప్స్ విషయంలో పూర్తి నివేదికలు రావాల్సి ఉందని ఆయుష్ కమిషనర్ సీఎంకు చెప్పారు. నివేదికలు రావడానికి మరో 2–3 వారాల సమయం పట్టే అవకాశం ఉందని వెల్లడించారు. ఆనందయ్య మందు వాడినంత మాత్రాన మిగిలిన మందులు ఆపొద్దని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూ.. ఎవరి ఇష్టాను సారం వారు ఆనందయ్య మందును వాడుకోవచ్చని ప్రభుత్వ తెలిపింది. ఆనందయ్య మందును తీసుకోవడానికి కోవిడ్ పాజిటివ్ రోగులు రాకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రోగులకు బదులు వారి సంబంధీకులు వచ్చి మందును తీసుకెళ్తే.. కోవిడ్ విస్తరించే ప్రమాదం తప్పుతుందని సూచించింది.
Also Read: ఒక్క చేపతో వారి సుడి మారిపోయింది.. ఎంతకు అమ్మారో తెలిస్తే మైండ్ బ్లాంక్