లాక్‌డౌన్‌ 3.0.. రెడ్‌ జోన్‌లలో సడలింపులు ఇవే..

|

May 02, 2020 | 2:21 PM

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం మూడో దశ లాక్ డౌన్‌ను విధించింది. ఈ నెల 3వ తేదీతో రెండోదశ లాక్ డౌన్ ముగిస్తుండగా.. మే 4 నుంచి మే 17 వరకు లాక్ డౌన్ 3.0 అమలులోకి రానుంది. అయితే ఈ మూడోదశ లాక్ డౌన్‌లో జోన్ల వారీగా కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చింది. ముఖ్యంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉండే రెడ్ జోన్లలో సడలింపులు, నిబంధనలు కఠినంగా ఉండనున్నాయి. […]

లాక్‌డౌన్‌ 3.0.. రెడ్‌ జోన్‌లలో సడలింపులు ఇవే..
Follow us on

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం మూడో దశ లాక్ డౌన్‌ను విధించింది. ఈ నెల 3వ తేదీతో రెండోదశ లాక్ డౌన్ ముగిస్తుండగా.. మే 4 నుంచి మే 17 వరకు లాక్ డౌన్ 3.0 అమలులోకి రానుంది. అయితే ఈ మూడోదశ లాక్ డౌన్‌లో జోన్ల వారీగా కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చింది. ముఖ్యంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉండే రెడ్ జోన్లలో సడలింపులు, నిబంధనలు కఠినంగా ఉండనున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం…

రెడ్ జోన్ సడలింపులు…

  • కార్లలో ఇద్దరు వ్యక్తులు(డ్రైవర్ + ప్యాసెంజర్)మాత్రమే ప్రయాణించాలి. అలాగే బైక్‌పై ఒక్కరికి మాత్రమే అనుమతి.
  • అత్యవసర సరుకులు ఉత్పత్తి చేసే పరిశ్రమలు, మెడికల్ ఉత్పత్తులు, ఐటీ హార్డ్‌వేర్‌, జూట్ మిల్లులకు అనుమతి ఉంది. ఇక్కడ పనిచేసే వారందరూ తప్పకుండా సామాజిక దూరాన్ని పాటిస్తూ, మాస్క్ ధరించాల్సి ఉంటుంది.
  • పల్లె ప్రాంతాల్లో ఉండే అన్ని పరిశ్రమలకు సడలింపులు వర్తిస్తాయి.
  • పట్టణాల్లో భవన నిర్మాణ పనులు స్థానికంగా ఉన్న కూలీలతో కొనసాగుతాయి. అంతేకాక అక్కడ పని చేసేందుకు వచ్చే కూలీలను బయట ప్రాంతాలకు తరలించకూడదు.
  • మాల్స్, అందులో ఉండే షాపులకు అనుమతి లేదు. అయితే సింగల్ విండో షాపులు, కాలనీల్లోని షాపులకు, గృహ సముదాయాల్లో ఉండే షాపులకు అనుమతి ఉంది. ఇక ఖచ్చితంగా భౌతిక దూరాన్ని పాటించాలి.
  • ఈ కామర్స్‌ సంస్థలు కేవలం నిత్యావసర వస్తువులను మాత్రమే డెలివరీ చేయాల్సి ఉంటుంది.
  • ప్రైవేట్ ఆఫీసులు 33శాతం స్టాఫ్‌తో తమ కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు.
  • డిప్యూటీ సెక్రటరీ, ఆపైస్థాయి‌ ప్రభుత్వ ఆఫీసులు 100 శాతం సిబ్బందితో.. అలాగే మిగిలిన ప్రభుత్వ ఆఫీసులన్నీ కూడా 33 శాతం సిబ్బందితో పని చేయాల్సి ఉంటుంది.

Read More:

కొంపముంచిన వన్ బై టూ ఛాయ్… గుంటూరులో ఏకంగా 100 మందికి..

ప్రభుత్వం సంచలన నిర్ణయం.. భారీగా తగ్గనున్న పెట్రోల్ ధరలు.!

లాక్‌డౌన్‌ 3.0.. జోన్లు వారీగా నిబంధనలు ఇవే..

మందుబాబులకు గుడ్ న్యూస్.. లాక్ డౌన్ తర్వాత తెరుచుకోనున్న మద్యం షాపులు!