ఇంటికొచ్చి మరీ మహిళకు బర్త్ డే గిఫ్ట్.. హైదరాబాద్ పోలీసుల న్యూ సర్‌ప్రైజ్..

| Edited By:

Apr 24, 2020 | 6:44 PM

'హలో మేడం.. మేము అమెరికాలో ఉంటాం. లాక్‌డౌన్‌ వల్ల ఇండియాకు రాలేకపోయాం. ఇవాళ మా అమ్మ 60వ బర్త్‌ డే ఉంది. కానీ మేము లేకపోవడం వల్లే ఆమె పుట్టిన రోజు జరుపుకోవడం లేదు. ప్లీజ్ మీరు ఇంటికి వెళ్లి విష్ చేస్తే..

ఇంటికొచ్చి మరీ మహిళకు బర్త్ డే గిఫ్ట్.. హైదరాబాద్ పోలీసుల న్యూ సర్‌ప్రైజ్..
Follow us on

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువ కావడంతో మరింత కఠిన చర్యలు అమలు పరుస్తున్నారు అధికారులు. ఈ కరోనా వల్ల ముఖ్యంగా వైద్యులు, పోలీసులు ఎక్కువగా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజల కోసం కుటుంబాలకు దూరంగా ఉంటూ కష్టపడుతున్నారు. ఇలాంటి సమయంలో మల్కాజ్ గిరి డీసీపీ రక్షిత కే మూర్తికి వెరైటీ రిక్వెస్ట్ వచ్చింది.

‘హలో మేడం.. మేము అమెరికాలో ఉంటాం. లాక్‌డౌన్‌ వల్ల ఇండియాకు రాలేకపోయాం. ఇవాళ మా అమ్మ 60వ బర్త్‌ డే ఉంది. కానీ మేము లేకపోవడం వల్లే ఆమె పుట్టిన రోజు జరుపుకోవడం లేదు. ప్లీజ్ మీరు ఇంటికి వెళ్లి విష్ చేస్తే సంతోషపడుతుంది. అమ్మకు సర్‌ప్రైజ్ అంటే చాలా ఇష్టం. ఇలా విజ్ఞప్తి చేస్తున్నందుకు ఏమీ అనుకోవద్దు’. అని అమెరికాలో ఉండే ఓ వ్యక్తి మెయిల్ పంపారు. దీనికి స్పందించిన డీసీపీ పుట్టిన రోజు వేళ నిజంగానే ఆమెను సర్‌ప్రైజ్ చేశారు.

ఆల్ఫ్రెడ్ అషర్ పాల్ అనే వ్యక్తి అమెరికాలోని కొలరాడోలో జాబ్ చేస్తున్నాడు. అతని తల్లి కుట్టి హుదస్సా పాల్ సికింద్రాబాద్‌లోని సైనిక్‌పురిలో ఒంటరిగా నివసిస్తున్నారు. ఆమె టీచర్‌గా పని చేసి ప్రస్తుతం రిటైర్‌ అయ్యారు. ఈ శుక్రవారం ఆమెది 60వ బర్త్‌డే బాగా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేద్దామనుకున్నాడు ఆల్ర్ఫెడ్ అషర్ పాల్. కానీ లాక్‌డౌన్ వల్ల కుదరలేదు. దీంతో మల్కాజ్‌గిరి డీసీపీకి ఈ-మెయిల్ పెట్టాడు. దీనికి స్పందించిన డీసీపీ ఇన్‌స్పెక్టర్ ఏ నరసింహాన్ని కుట్టి హుదస్సా ఇంటికి పంపించారు. ఆయన ఇంటి ముందు స్పీకర్‌లో పాటలు పాడుతూ.. బర్త్ డే విషెస్ చెప్పారు. అనంతరం విషయం చెప్పి పండ్లను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ ఊహించని సర్‌ప్రైజ్‌తో ఆమె ఎంతో సంతోషపడ్డారు. అనంతరం పోలీస్ శాఖకు ధన్యవాదాలు తెలిపారు.

Read More: 

అక్షయ తృతీయ బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయితో బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు!

హైపర్‌ ఆది పెళ్లి డేట్ ఫిక్స్.. అమ్మాయిది ఏ జిల్లా అంటే!

సీఎం కేసీఆర్‌కు ఆర్జీవీ దిమ్మతిరిగే ఛాలెంజ్..

గుడ్‌న్యూస్: వాట్సాప్‌లో ఒకేసారి 8 మందితో వీడియో కాలింగ్