Lambda variant: ప్రపంచానికి పెను ముప్పుగా డెల్టా, లాంబ్డా వేరియంట్లు.. మరింత అప్రమత్తంగా ఉండాలిః డబ్ల్యూహెచ్ఓ

|

Jul 07, 2021 | 10:50 AM

కరోనా ముప్పు తొలగిపోతుందనుకుంటున్న తరుణంలో మరింత జాగ్రత్త అవసరమంటున్నారు నిపుణులు. కొత్తగా డెల్టా, లాంబ్డా వేరియంట్ల మళ్లీ కేసులు పెరుగుతున్నాయి.

Lambda variant: ప్రపంచానికి పెను ముప్పుగా డెల్టా, లాంబ్డా వేరియంట్లు.. మరింత అప్రమత్తంగా ఉండాలిః డబ్ల్యూహెచ్ఓ
Lambda Variant
Follow us on

Lambda variant New Strain: కరోనా ముప్పు తొలగిపోతుందనుకుంటున్న తరుణంలో మరింత జాగ్రత్త అవసరమంటున్నారు నిపుణులు. కొత్తగా డెల్టా, లాంబ్డా వేరియంట్ల మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. అటు ప్రపంచ దేశాలకు అప్రమత్తంగా ఉండాలని సందేశం పంపింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఈ వేరియంట్‌ను గతంలో C.37 గా ప్రకటించింది. కరోనా వైరస్ నుంచి రూపాంతరం చెందుతున్న ఏడవ సరికొత్త వేరియంట్‌గా పేర్కొంది.

ప్రపంచ దేశాలు కరోనా నుంచి ఇప్పట్లో ఊపిరి పీల్చుకునే అవకాశాలు కనిపించట్లేదు. కాలానికి తగ్గట్టుగా మార్పులు చేసుకుంటున్న కరోనా… కొత్త వేరియంట్ల రూపంలో విరుచుకుపడుతోంది. ఇండియాలో సెకండ్ వేవ్ కి కారణమైన డెల్టా వేరియంట్ ఇప్పుడు విదేశాల్లో విజృంభిస్తోంది. 96 దేశాల్లో ఇది విస్తరించింది. అటు దక్షిణ అమెరికా, లాటిన్ ఆమెరికా దేశాల్లో లాంబ్డా వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్రపంచ దేశాలు కరోనా పోయింది అనుకోవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అని హెచ్చరించింది.

పలు దేశాల్లో డెల్టా ప్లస్‌ కలవరపెడుతుంటే..మరికొన్ని దేశాల్లో లాంబ్డా వణుకు పుట్టిస్తోంది. కరోనా కొత్త వేరియంట్ లాంబ్డా ధాటికి గజగజలాడిపోతోంది బ్రిటన్‌. కొత్త వేరియంట్ డెల్టా కంటే లామ్డా చాలా ప్రమాదకరమైనదని బ్రిటన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు అంతర్జాతీయ ప్రయాణికుల్లో 6 కేసులు నమోదయ్యాయి. గత నాలుగు వారాల్లో బ్రిటన్‌తో పాటు..మరో 30 దేశాలకు వ్యాప్తించింది ఈ లాంబ్డా వేరియంట్‌. దీంతో ఈ స్ట్రెయిన్‌పై ఫోకస్‌ పెట్టాల్సిందేనని ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.

పెరూ దేశంలో తొలి లాంబ్డా వేరియంట్ ఉద్భవించిందని ప్రపంచ ఆరోగ్య శాఖ భావిస్తోంది. ఈ వైరస్ ద్వారా దాదాపు 80% ఇన్ఫెక్షన్లు వ్యాప్తిస్తున్నట్లు తెలిపింది. ఇది డిసెంబర్ 2020 నాటి నమూనాలలోనే శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది పొరుగున ఉన్న చిలీలో కూడా లాంబ్డా వేరియంట్ ప్రబలుతోంది. కానీ ఇటీవల వరకు, ఇది ఎక్కువగా అర్జెంటీనాతో సహా కొన్ని దక్షిణ అమెరికా దేశాలలో కేంద్రీకృతమై ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.

WHO చే జాబితా చేయబడిన 11 అధికారిక SARS-CoV-2 వేరియంట్లు ఇప్పుడు ఉన్నాయి. అన్ని SARS-CoV-2 రకాలు వాటి స్పైక్ ప్రోటీన్లలోని ఉత్పరివర్తనాల ద్వారా ఒకదానికొకటి వేరు చేయబడతాయి. వైరస్ భాగాలు మానవ కణాలపై దాడి చేయడానికి అనుమతిస్తాయి. లాంబ్డా అనుమానాస్పద సమలక్షణ చిక్కులతో అనేక ఉత్పరివర్తనాలను కలిగి ఉందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఈ జన్యుసంబంధమైన మార్పులతో సంబంధం ఉన్న పూర్తి స్థాయిలో ప్రస్తుతం పరిమిత సాక్ష్యాలు ఉన్నాయి. ప్రతికూల చర్యలపై ప్రభావాన్ని బాగా అర్థం చేసుకోవడానికి, వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి సమలక్షణ ప్రభావాలపై మరింత బలమైన అధ్యయనాలు అవసరమని WHO ఒక ప్రకటనలో తెలిపింది టీకాల నిరంతర ప్రభావాన్ని ధృవీకరించడానికి మరిన్ని అధ్యయనాలు చేయాల్సి ఉందని పేర్కొంది.

Read Also..  India Corona: గుడ్ న్యూస్.. దేశ ప్రజలకు భారీ ఊరట.. గణనీయంగా తగ్గిన పాజిటివ్ కేసులు.. పూర్తి వివరాలు!