‘21డేస్’..క‌రోనాపై కొత్త సినిమా ఫస్ట్ లుక్ ఇదే..

|

Apr 16, 2020 | 11:03 AM

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే వేలాదిమందిని ఈ వైరస్ పొట్టన పెట్టుకుంది. సెలబ్రిటీలు కరోనాపై అవగాహన కల్పిస్తూ పాటలు, షూట్లు చేస్తున్నారు. ఇప్పుడు కరోనా వైరస్‌పై సినిమా కూడా వచ్చేస్తుంది.

‘21డేస్’..క‌రోనాపై కొత్త సినిమా ఫస్ట్ లుక్ ఇదే..
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే వేలాదిమందిని ఈ వైరస్ పొట్టన పెట్టుకుంది. దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు లాక్ డౌన్ సైతం మరో 19 రోజుల పాటు పొడిగిస్తూ…కేంద్రం ప్ర‌క‌టించింది.  ప్రభుత్వాలు, అధికారులతో పాటు సెలబ్రిటీలు సైతం కరోనాపై అవగాహన కల్పిస్తూ పాటలు, షూట్లు చేస్తున్నారు. ఇప్పుడు కరోనా వైరస్‌పై సినిమా కూడా వచ్చేస్తుంది.

 

కోవిడ్‌-19 నేప‌థ్యం, లాక్‌డౌన్‌ రోజుల్లో జరిగిన విషయాల ఇతివృత్తంగా కోలివుడ్‌లో సినిమా తీస్తున్నారు. ఈ చిత్రానికి  ‘21డేస్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో తెరకెక్కనుంది.ఎంబీఆర్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై  ఎం విజయ్‌ భాస్కర్ నిర్మాణ, ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తెలుగు, త‌మిళం, హిందీ భాషల్లో తెరకెక్కనుంది. ఆన్‌లైన్‌ ద్వారా నటీనటుల ఎంపిక పనులు జరుగుతున్నాయని చిత్రవర్గాలు చెబుతున్నాయి. లాక్‌డౌన్‌ తర్వాత సింగిల్‌ షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తి చేయనున్నట్లు సంబంధిత వర్గాల స‌మాచారం.