కరోనా వైరస్: ముక్కులోని ఆ రెండు కీలక కణాలే కారణమట..!

| Edited By:

Apr 25, 2020 | 7:40 AM

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ గురించి రోజుకో కొత్త వార్త వెలుగులోకి వస్తోంది. ఈ వైరస్‌పై పరిశోధనలు చేస్తోన్న శాస్త్రవేత్తలు.. మహమ్మారి గురించి కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు.

కరోనా వైరస్: ముక్కులోని ఆ రెండు కీలక కణాలే కారణమట..!
Follow us on

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ గురించి రోజుకో కొత్త వార్త వెలుగులోకి వస్తోంది. ఈ వైరస్‌పై పరిశోధనలు చేస్తోన్న శాస్త్రవేత్తలు.. మహమ్మారి గురించి కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బ్రిటన్ శాస్త్రవేత్తలు వైరస్‌కు సంబంధించి మరో విషయాన్ని బయటపెట్టారు. మానవ ముక్కులోని రెండు కీలక కణాలు కరోనా వైరస్‌కు ప్రవేశద్వారాలుగా వ్యవహరిస్తున్నట్లు వారు గుర్తించారు. బ్రిటన్‌లోని వెల్కమ్ సాంగర్‌ ఇన్‌స్టిట్యూట్, నెదర్లాండ్స్‌లోని యూనివర్సిటీ మెడికల్ సెంటర్ గ్రొనిన్‌జెన్‌ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో ఈ విషయం తెలిసింది.

ముక్కులోని ఏసీఈ-2, టీఎంపీఆర్ఎస్‌ఎస్‌-2 ప్రొటీజ్ అనే ప్రొటీన్లు కరోనా వైరస్‌ శరీరంలోకి ప్రవేశించడానికి వీలు కల్పిస్తున్నాయని వారు గుర్తించారు. ముక్కువ లైనింగ్ మీదున్న కణాలతో సహా శరీరంలోని వివిధ అవయవాల్లో కూడా ఇవి ఉన్నట్లు వారు వెల్లడించారు. శ్వాసనాళాల్లోని ఇతర కణాలతో పోలీస్తే ముక్కులోని గోబ్లెట్ కణాలు, సిలియేటెడ్ కణాల్లో ఈ రెండు రకాల ప్రొటీన్లు ఎక్కువగా ఉన్నాయని ఓ శాస్త్రవేత్త వెల్లడించారు. వైరస్‌ మానవ శరీరంలోకి వెళ్లేందుకు ఇవి ప్రాధమిక ఇన్‌స్పెక్షన్ మార్గాలుగా ఉపయోగపడుతున్నాయని వారాడన్ సుంగ్నాక్ అనే శాస్త్రవేత్త పేర్కొన్నారు.

Read This Story Also: క్వారంటైన్‌ కేంద్రాన్ని తరలించండి.. ఎమ్మెల్యే ఆందోళన..!