కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 6,257 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,88,611కి చేరింది. వీటిలో కరోనా నుంచి కోలుకుని 1,05,599 ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 79,606 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి 3,398 మంది మరణించారు. కాగా, రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా బెంగళూరు అర్బన్‌లోనే నమోదవుతున్నాయి.
6,257 #COVID19 cases reported on 10th August in Karnataka. 6,473 people discharged today, 86 new deaths also reported. Total number of cases in the state is now at 1,88,611, including 1,05,599 discharged, 79,606 active cases, and 3,398 deaths: State Health Department pic.twitter.com/UWm1tecSf7
— ANI (@ANI) August 11, 2020
Read More :