కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 7,040 కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వీటిలో 2,131 కరోనా పాజిటివ్ కేసులు బెంగళూరు అర్బన్‌లోనే నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన పాజిటివ్
కేసుల సంఖ్య 2,26,966కి చేరింది. వీటిలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 1,41,491 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 81,512 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా, రాష్ట్రంలో అన్‌లాక్ 1.0 ప్రారంభమైన తర్వాత కేసుల సంఖ్య అమాంతం
పెరిగిపోయింది. నిత్యం 5 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
7040 new #COVID19 positive cases (including 2131 cases from Bengaluru Urban), 6680 discharges and 124 deaths reported in Karnataka today. Total number of cases rise to 226966 including 81512 active cases, 141491 discharges and 3947 deaths: State Health Department. pic.twitter.com/p3EhlMUTPs
— ANI (@ANI) August 16, 2020
Read More :