జర్నలిస్టుల కరోనా టెస్టులను అడ్డుకున్న ఎమ్మెల్సీ అరెస్ట్

| Edited By:

Apr 26, 2020 | 4:16 PM

లాక్‌డౌన్‌ సమయంలోనూ జర్నలిస్టులు ఎంతో ధైర్యంగా విధులు నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే. అయితే ముంబై, చెన్నై మొదలగు నగరాల్లో జర్నలిస్టులకు కరోనా వైరస్ సోకింది. దీంతో దేశవ్యాప్తంగా మీడియా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఆయా నగరాల్లో జర్నలిస్టులకు కరోనా టెస్టులు..

జర్నలిస్టుల కరోనా టెస్టులను అడ్డుకున్న ఎమ్మెల్సీ అరెస్ట్
Follow us on

లాక్‌డౌన్‌ సమయంలోనూ జర్నలిస్టులు ఎంతో ధైర్యంగా విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ముంబై, చెన్నై మొదలగు నగరాల్లో జర్నలిస్టులకు కరోనా వైరస్ సోకింది. దీంతో దేశవ్యాప్తంగా మీడియా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఆయా నగరాల్లో జర్నలిస్టులకు కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు అధికారులు. ఈ మేరకు కర్ణాటకలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదేశాల మేరకు మాండ్యలోని అంబేద్కర్ భవన్‌లో జర్నలిస్టులకు కోవిడ్-19 టెస్టులు నిర్వహించారు. దీన్ని వ్యతిరేకిస్తూ జేడీఎస్ ఎమ్మెల్సీ శ్రీకాంత్, అతని కొడుకు క్రిషిక్ గౌడ మరికొంత మంది అనుచరులతో కలిసి వచ్చి ఇక్కడ కరోనా పరీక్షలు జరిపేందుకు వీలు లేదని ఆందోళన చేశారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్, అల్లర్లు, నిర్లక్ష్యం తదితర కారణాలతో వారిపై పలు సెక్షన్ల కింద నమోదు చేశారు.

Read More: 

తెలంగాణలో ఇకపై ఆ పేర్లు ఉండవ్.. కేసీఆర్ కీలక నిర్ణయం

లాక్‌డౌన్ ఫ్రస్ట్రేషన్‌ తెలిపితే.. డబ్బులే డబ్బులు!

అక్షయ తృతీయ బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయితో బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు!