ప్రభుత్వం కీలక నిర్ణయం.. జూన్ 1 నుంచి ఆలయాల్లో దర్శనాలు..

|

May 27, 2020 | 7:10 AM

లాక్ డౌన్ 4.0లో కేంద్ర ప్రభుత్వం పలు సడలింపులు ఇవ్వడంతో దేశవ్యాప్తంగా ఆర్ధిక కార్యకలాపాలు, ప్రజా రవాణా ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. అయితే జన సాంద్రత ఎక్కువగా ఉండే మాల్స్, థియేటర్లు, ప్రార్ధనా మందిరాలను మాత్రం కేంద్రం మూసి ఉంచింది. కానీ కరోనా కోరలు చాస్తున్న వేళ కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచి రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో భక్తుల దర్శనాలకు అనుమతిస్తున్నట్లు సీఎం యడ్యూరప్ప వెల్లడించారు. అంతేకాక రాష్ట్రంలోని 50 దేవాలయాలకు సంబంధించి […]

ప్రభుత్వం కీలక నిర్ణయం.. జూన్ 1 నుంచి ఆలయాల్లో దర్శనాలు..
Follow us on

లాక్ డౌన్ 4.0లో కేంద్ర ప్రభుత్వం పలు సడలింపులు ఇవ్వడంతో దేశవ్యాప్తంగా ఆర్ధిక కార్యకలాపాలు, ప్రజా రవాణా ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. అయితే జన సాంద్రత ఎక్కువగా ఉండే మాల్స్, థియేటర్లు, ప్రార్ధనా మందిరాలను మాత్రం కేంద్రం మూసి ఉంచింది. కానీ కరోనా కోరలు చాస్తున్న వేళ కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

జూన్ 1 నుంచి రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో భక్తుల దర్శనాలకు అనుమతిస్తున్నట్లు సీఎం యడ్యూరప్ప వెల్లడించారు. అంతేకాక రాష్ట్రంలోని 50 దేవాలయాలకు సంబంధించి ఆన్లైన్ సేవల బుకింగ్‌ను కూడా ప్రారంభించారు. దీనికి సంబంధించి మే 31లోగా మందిరాలలో అవసరమైన మార్పులు చేస్తామని.. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ భక్తులు దర్శనాలు చేసుకోవచ్చునని మంత్రి కోటా శ్రీనివాస్ పూజారీ తెలిపారు. కాగా, ఉత్సవాలు, పర్వదినాలను జరుపుకునేందుకు మాత్రం అనుమతి లేదని సీఎం యడ్యూరప్ప స్పష్టం చేశారు. ఇక మంగళవారం లెక్కల బట్టి.. కర్ణాటకలో 2182 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 44 మంది వైరస్ కారణంగా మృతి చెందారు.