Girl Asking Her Dead Mother Phone: కరోనా మహమ్మారి మనుషుల ప్రాణాలతోనే కాకుండా వారి ఎమోషన్స్‌తోనూ ఆడుకుంటోంది. కరోనా సోకడంతో ప్రాణాలు కోల్పోయిన వారు కొందరైతే.. చనిపోయిన వారిని తలుచుకొని బాధపడుతూ నరకాన్ని అనుభవిస్తున్న వారు మరికొందరు. ఇలా మనుషుల భావోద్వేగాలను సైతం కరోనా శాసిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కర్ణాటకలో జరిగిన ఓ సంఘటన కంటతడి పెట్టిస్తోంది.
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోకి కొడగు జిల్లా కుషాల్ నగర్‌కు చెందిన ప్రభా అనే మహిళతో పాటు భర్త కూతురు హృతిక్ష మే మొదట్లో కరోనా బారిన పడ్డారు. అయితే భర్త, కూతురు క్వారంటైన్‌లోకి వెళ్లగా.. ప్రభా మాత్రం ఆసుపత్రిలో చేరింది. చికిత్స అందుతోన్న సమయంలో ఆరోగ్యం విషమించడంతో ప్రభా మే 6న మరణించింది. దీంతో వారి కుంటుంబలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. మరణించిన ఆ మహిళకు చెందిన వస్తువులను తాజాగా వైద్యులు కుటుంబ సభ్యులకు అందించారు. అయితే అందులో ఆమె మొబైల్ ఫోన్ మిస్ అయింది. ఈ విషయమై తొమ్మిదేళ్ల హృతిక్ష పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇందులో భాగంగా ఓ లేఖను రాసింది. అయితే ఆ చిన్నారి లేఖలో పేర్కొన్న అంశాలు కంటతడి పెట్టిస్తున్నాయి. కొడగు జిల్లా అధికారులకు లేఖ రాసిన హృతిక్ష.. దయచేసి నా తల్లి ఫోన్‌ను నాకు తిరిగి ఇప్పించండి. ఎందుకంటే అందులో మా అమ్మ ఫొటోలు, వీడియోలు ఉన్నాయి. తల్లిని కోల్పోయిన నాకు అవే జ్ఞాపకాలు మిగిలి ఉన్నాయన్న భావనతో చిన్నారి రాసిన లేఖ అందరినీ కంటతడి పెట్టిస్తోంది. దీని స్పందించిన అధికారులు వెంటనే మొబైల్ ఫోన్‌ను పట్టిస్తామని చిన్నారికి హామీ ఇచ్చారు. ఏది ఏమైనా ఇలా మనుషుల భావోద్వేగాలతో ఆడుకుంటున్న ఈ మయదారి రోగం మనుషులను ఇంకెప్పుడు వదిలి పెడుతుందో.
Yellow Fungus: దేశంలో ఎల్లో ఫంగస్ వ్యాప్తి.. యూపీలో తొలి కేసు నమోదు.. లక్షణాలు ఇవి
Covid 19 Death Audit Report: ఏపీలో కరోనా మరణాలపై డెత్ ఆడిట్.. వెలుగులోకి సంచలన విషయాలు..