కాణిపాకంలో కరోనా కలకలం.. ఆలయంలోని హోమ్ గార్డ్‌కి పాజిటివ్..

| Edited By:

Jun 15, 2020 | 6:02 PM

చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో కరోనా కలకలం సృష్టించింది. దీంతో ఆలయంలోకి భక్తుల అనుమతిని నిషేధించారు ఆలయ అధికారులు. ఆలయ హోం గార్డుకు కోవిడ్ పాజిటివ్ రావడంతో..

కాణిపాకంలో కరోనా కలకలం.. ఆలయంలోని హోమ్ గార్డ్‌కి పాజిటివ్..
Follow us on

చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో కరోనా కలకలం సృష్టించింది. దీంతో ఆలయంలోకి భక్తుల అనుమతిని నిషేధించారు ఆలయ అధికారులు. ఆలయ హోం గార్డుకు కోవిడ్ పాజిటివ్ రావడంతో.. రెండు రోజుల పాటు భక్తులకు దర్శనాలను రద్దు చేశారు. వెంటనే ఆలయాన్ని మొత్తం శానిటైజ్ చేసి.. మూసివేయనున్నారు.

తాజాగా ఏపీలో కరోనా కేసులు ఎక్కువ అవుతున్న కారణంగా ఆలయ నిర్వహకులకి, సిబ్బందికి కూడా కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కాణిపాకం ఆలయంలో కూడా టెస్టులు నిర్వహించగా.. అక్కడ విధులు నిర్వహించే హోం గార్డుకు కరోనా వైరస్ సోకినట్లు నిర్థారణ అయ్యింది. కాణిపాకం ఆలయాన్ని ఇటీవలే ఎన్నో జాగ్రత్తలు తీసుకుని మరీ ఓపెన్ చేశారు. భక్తులు కూడా అన్ని విధాలా సోషల్ డిస్టెన్స్ పాటించేలా చేశారు. అయినా కూడా కరోనా ఎటాక్ చేసింది. దీంతో తాత్కాలికంగా భక్తులకు ఆలయ ప్రవేశాన్ని నిలిపివేస్తూ ఆలయ ఈవో ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా ఇటీవలే తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయంలో పని చేస్తున్న సిబ్బందికి ఒకరికి కరోనా రావడంతో ఆ ఆలయాన్ని మూసివేశారు. అలాగే శ్రీకాళహస్తి ఆలయ అర్చకుడికి కూడా కరోనా పాజిటివ్ రావడంతో ఆలయంలో భక్తులకు దర్శనాలు నిలిపివేశారు.

కాగా ప్రస్తుతం ఏపీలో.. కొత్త‌గా 304 పాజిటివ్ కేసులు నమోదైన‌ట్లు వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 246 మంది కాగా, ఇతర రాష్ట్రాలకు చెందిన 52 మంది, విదేశాలకు చెందినవారు 8 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. తాజాగా ఇద్దరు కరోనాతో చనిపోయారు. కర్నూలు జిల్లాలో ఒకరు, అనంతపురం జిల్లాలో ఒకరు మరణించారు. 47మంది కరోనా నుంచి కోలుకున్నారు.

తాజా కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5087కి చేరింది. ఇప్పటివరకు 2770 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 2231. ఇప్పటివరకు రాష్ట్రంలో వైరస్ తో చనిపోయిన వారి సంఖ్య 86కి పెరిగింది. రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.

Read More: 

బెజవాడ గ్యాంగ్ వార్ ఘటనపై పోలీసుల కఠిన నిర్ణయం.. వారందరికీ నగర బహిష్కరణ..

పెట్రోల్, డీజిల్ ధరల మోత.. తొమ్మిది రోజుల్లో రూ.5 పెంపు..

తిరిగి ప్రారంభమైన లోకల్‌ ట్రైన్లు.. వారికి మాత్రమే అనుమతి