Covid 19 Johnson & Johnson: దేశంలో మరో వ్యాక్సిన్ అందుబాటులోకొచ్చింది. అమెరికా కంపెనీ అభివృద్ధి చేసిన జాన్సన్ అండ్ జాన్సన్.. సింగిల్ డోస్ టీకాకు కేంద్రం అనుమతిచ్చింది.జాన్సన్ టీకాతో దేశంలో మొత్తం 5 కంపెనీల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు కేంద్రమంత్రి మాండవీయ. ఈ నెల 5న అత్యవసర అనుమతి కోసం జాన్సన్ అండ్ జాన్సన్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. కరోనా నియంత్రణలో తమ వ్యాక్సిన్ చాలా చక్కగా పనిచేస్తుందని జాన్సన్ అండ్ జాన్సన్ ప్రకటించింది. మిగతా వ్యాక్సిన్లతో పోలిస్తే ఈ టీకా సింగిల్ డోస్ వేసుకుంటే సరిపోతుంది. అమెరికాలో సక్సెస్ రేటు ఎక్కువ కావడంతో ఈ వ్యాక్సిన్ వేసుకోవడానికి జనం ఆసక్తి చూపుతున్నారు.
ఇక ఇప్పటికే మన దేశంలో 3 వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్ టీకాలను ప్రజలకు ఇస్తున్నారు. కరోనా విజృంభణతో దేశంలో వ్యాక్సిన్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయడంలో భాగంగా విదేశాలకు చెందిన వ్యాక్సిన్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతోంది. ఇదే క్రమంలో భారత్‌లో అత్యవసర వినియోగానికి మరో కోవిడ్-19 వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చామని కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ తెలిపారు. కోవిడ్-19పై కలసికట్టుగా చేస్తున్న యుద్ధానికి ఈ నిర్ణయం ఊతమిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్లో వెల్లడించారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా.
India expands its vaccine basket!
Johnson and Johnson’s single-dose COVID-19 vaccine is given approval for Emergency Use in India.
Now India has 5 EUA vaccines.
This will further boost our nation’s collective fight against #COVID19
— Mansukh Mandaviya (@mansukhmandviya) August 7, 2021
మరోవైపు, పెద్దల కోసం కొవావాక్స్టీకాను ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నట్లు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా ప్రకటించారు. వచ్చే ఏడాది ఫస్ట్ క్వార్టర్‌లో పిల్లలకు వినియోగించేందుకు ఈ టీకాను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఈ మేరకు హోం మంత్రి అమిత్ షాతో సమావేశం అనంతరం ఈ ప్రకటన చేశారు పూనావాలా..దాదాపు 30 నిమిషాలపాటు వారిద్దరూ భేటీ అయ్యారు.
Read Also.. Viral Video: ఇంకా నయం వధువు కొట్టలేదు.. వరుడి స్నేహితులు ఎలాంటి గిఫ్ట్ ఇచ్చారో తెలుసా.. వీడియో