ఇండోర్‌లో పెరుగుతున్న కేసులు.. భయం గుప్పిట్లో ప్రజలు..

| Edited By:

Jun 29, 2020 | 7:47 AM

మధ్యప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా భోపాల్‌, ఇండోర్‌ నగరాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా ఇండోర్‌లో కొత్తగా మరో 49 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇండోర్‌లో పెరుగుతున్న కేసులు.. భయం గుప్పిట్లో ప్రజలు..
Follow us on

మధ్యప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా భోపాల్‌, ఇండోర్‌ నగరాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా ఇండోర్‌లో కొత్తగా మరో 49 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని జిల్లా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు జిల్లాలో 4,664 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 3,435 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా.. మరో 226 మంది కరోనా బారినపడి మరణించారు.

మరోవైపు దేశ వ్యాప్తంగా కూడా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే దేశంలో 5.28 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 2.03 యాక్టివ్ కేసులు ఉండగా.. మరో 3 లక్షల మందికి పైగా కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి 16 వేల మందికి పైగా
మరణించారు.