బ్రేకింగ్: ఇటలీలో చిక్కుకున్న విద్యార్థులకు విముక్తి.. కేంద్రం ప్రత్యేక సాయం

| Edited By:

Mar 12, 2020 | 1:17 PM

కరోనా ఎఫెక్ట్‌తో భారతీయ విద్యార్థులు ఇటలీలో చిక్కుకుపోయారు. తాజాగా ఈ ఘటనపై కేంద్రం స్పందించింది. ప్రత్యేక వైద్య బృందాన్ని ఇటలీకి పంపిస్తున్నట్లు పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అక్కడ చిక్కుకున్న వీరికి వైద్య పరీక్షలు నిర్వహించి..

బ్రేకింగ్: ఇటలీలో చిక్కుకున్న విద్యార్థులకు విముక్తి.. కేంద్రం ప్రత్యేక సాయం
Follow us on

కరోనా ఎఫెక్ట్‌తో భారతీయ విద్యార్థులు ఇటలీలో చిక్కుకుపోయారు. తాజాగా ఈ ఘటనపై కేంద్రం స్పందించింది. ప్రత్యేక వైద్య బృందాన్ని ఇటలీకి పంపిస్తున్నట్లు పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అక్కడ చిక్కుకున్న వీరికి వైద్య పరీక్షలు నిర్వహించి, కరోనా లేని వారిని వెనక్కి తీసుకొస్తామని.. లోక్‌సభలో కేంద్రం ప్రకటించింది.

కాగా.. ఇదే ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. విదేశాంగ మంత్రి జయ శంకర్‌తో పాటు ఇండియన్ ఇటలీ ఎంబసీని.. ఇటలీ ఎయిర్ పోర్టులో ఇరుక్కున్న విద్యార్థుల వీడియోను ట్యాగ్ చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

ఉన్నత చదువుల కోసమని విదేశాలకు వెళ్లి తిరిగి భారత్‌కు వస్తున్న విద్యార్థులపై కరోనా ఎఫెక్ట్ పడింది. దేశం కానీ దేశంలో బిక్కుబిక్కు మంటూ బతుకుతున్నారు. ఇప్పటికిప్పుడు కరోనా లేదని నిరూపించే మెడికల్‌ సర్టిఫికెట్‌ ఎక్కడి నుంచి తీసుకురావాలంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదని, తెలంగాణ ప్రభుత్వమే తమను కాపాడాలని విజ్ఞప్తి చేశారు విద్యార్థులు. ఇందుకు సంబంధించిన వీడియో మెసేజ్‌లను పంపించారు. అయితే వీరితో పాటు కేరళ, కర్నాటక, నాగపూర్‌ విద్యార్థులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

Read More this also: వైసీపీ ఆవిర్భావ రోజు.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్

మహిళా సీఐపై చేయి చేసుకున్న వైసీపీ నేత..

హీరో, హీరోయిన్‌కు కరోనా.. షాక్‌లో సినీ ఇండస్ట్రీ

మరో 10 రోజుల్లో భారీగా తగ్గనున్న పెట్రోల్ ధరలు.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. మినిమమ్ బ్యాలెన్స్ రూల్ తొలగింపు