Corona Cases in India: దేశంలో కరోనా సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ తరుణంలో నిన్న దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 31,222 కేసులు నమోదయ్యాయి. ఆదివారంతో పోల్చుకుంటే.. సోమవారం దాదాపు 8 వేల కేసులు తగ్గాయి. దీంతోపాటు.. నిన్న కరోనా మహమ్మారి కారణంగా 290 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,30,58,843 కి పెరగగా.. మరణాల సంఖ్య 4,41,042 కి చేరింది. నిన్న కరోనా నుంచి 42,942 మంది కోలుకున్నారు. వీరితో కలిపి దేశంలో ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,22,24,937 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,92,864 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కాగా.. ఇప్పటివరకు దేశంలో 69,90,62,776 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.
India reports 31,222 new #COVID19 cases, 42,942 recoveries and 290 deaths in the last 24 hours, as per Health Ministry
Active cases: 3,92,864
Total cases: 3,30,58,843
Total recoveries: 3,22,24,937
Death toll: 4,41,042Total vaccination: 69,90,62,776 pic.twitter.com/heyaJn6PBm
— ANI (@ANI) September 7, 2021
సోమవారం దేశంలో నమోదైన కేసుల్లో కేరళలో 19,688 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఆ రాష్ట్రంలో 135 మంది మరణించారు.
కాగా.. నిన్న దేశవ్యాప్తంగా 15,26,056 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో ఇప్పటివరకు (సెప్టెంబర్ 6 వరకు) 53,31,89,348 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.
Also Read: