Coronavirus: దేశంలో అదుపులోకి వస్తోన్న కరోనా మహమ్మారి.. మరణాలు మాత్రం భారీగానే .. నిన్న ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..

|

Jan 30, 2022 | 10:12 AM

దేశంలో కరోనా (Covid 19) క్రమంగా అదుపులోకి వస్తోంది. వరుసగా మూడో రోజు కూడా కొత్త కేసుల్లో స్పల్ప తగ్గుదల కనిపించింది. అయితే గత రెండు రోజులుగా మరణాల (Death rates) సంఖ్య పెరగడం కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. 

Coronavirus: దేశంలో అదుపులోకి వస్తోన్న కరోనా మహమ్మారి.. మరణాలు మాత్రం భారీగానే .. నిన్న ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..
Coronavirus
Follow us on

దేశంలో కరోనా (Covid 19) క్రమంగా అదుపులోకి వస్తోంది. వరుసగా మూడో రోజు కూడా కొత్త కేసుల్లో స్పల్ప తగ్గుదల కనిపించింది. అయితే గత రెండు రోజులుగా మరణాల (Death rates) సంఖ్య పెరగడం కాస్త ఆందోళనకు గురిచేస్తోంది.   శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు దేశంలో కొత్తగా 2,34,281 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 893 మంది మహమ్మారి బారిన పడి మృత్యువాత పడ్డారు. ఈ మేరకు ఆదివారం కేంద్ర ఆరోగ్య శాఖ (Central health ministry) కొవిడ్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో మొత్తం 16,15,993 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఈ మేర కేసులు నమోదయ్యాయి.  తాజా మరణాలతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,94,091కు చేరుకుంది.   కాగా ప్రస్తుతం దేశంలో 18,84,937  క్రియాశీలక కేసులున్నాయి . ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ 14.50 శాతానికి చేరుకోగా.. వారాంతపు పాజిటివిటీ రేటు 16.40శాతంగా ఉంది.

పెరిగిన రికవరీ రేటు..

కాగా గడిచిన 24 గంటల్లో  3, 52, 784 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,87,13,494 కు చేరింది. కాగా ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 94.21 శాతానికి చేరుకుంది. ఇక కరోనా కట్టడికి దేశంలో వాక్సిన్ పంపిణీ చురుగ్గా కొనసాగుతుంది.   శనివారం ఒక్కరోజే 62,22,682 టీకా డోసులు అందించారు. కాగా ఇప్పటివరకు 165.70 కోట్ల వాక్సిన్ డోసులు వేసినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

Also read: CM KCR: సీఎం కేసీఆర్ కుటుంబంలో విషాదం.. మేనమామ కమలాకర్ రావు కన్నుమూత!

Ira Khan: ముసలిదైపోయింది అంటూ ఆమిర్ ఖాన్ కూతురిని దారుణంగా దూషించిన నెటిజన్.. హిత బోధ చేసిన ప్రముఖ సింగర్..

Pushpa: క్రికెట్ ప్రపంచాన్ని ఊపేస్తోన్న ‘పుష్ప’ ఫీవర్.. శ్రీవల్లి సిగ్నేచర్ స్టెప్పును అశ్విన్ ఎలా అనుకరించాడో మీరే చూడండి..