Coronavirus: కరోనా నుంచి ఊరట.. దేశంలో తగ్గుతోన్న కొత్త కేసులు, మరణాలు.. నిన్న ఎంతమంది వైరస్‌ బారిన పడ్డారంటే..

India Covid-19 Updates: దేశంలో కరోనా(Coronavirus) క్రమంగా తగ్గుముఖం పడుతోంది. మొన్నటి వరకు 3 లక్షలకు పైగా నమోదైన రోజువారీ కేసులు (Daily cases) ఇప్పుడు లక్షకు దిగి వస్తున్నాయి

Coronavirus: కరోనా నుంచి ఊరట.. దేశంలో తగ్గుతోన్న కొత్త కేసులు, మరణాలు.. నిన్న ఎంతమంది వైరస్‌ బారిన పడ్డారంటే..
Coronavirus

Updated on: Feb 06, 2022 | 10:35 AM

India Covid-19 Updates: దేశంలో కరోనా(Coronavirus) క్రమంగా తగ్గుముఖం పడుతోంది. మొన్నటి వరకు 3 లక్షలకు పైగా నమోదైన రోజువారీ కేసులు (Daily cases) ఇప్పుడు లక్షకు దిగి వస్తున్నాయి. తాజాగా నమోదైన కేసుల్లోనూ తగ్గుదల కనిపించింది. ఆదివారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ (Central Health Ministry) విడుదల చేసిన కరోనా బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,07,474 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,21,88,138 కు చేరింది. కొత్త కేసులతో కలిపి ప్రస్తుతం దేశంలో 12,25,011 క్రియాశీలక కేసులున్నాయి. ఇక దేశంలో తాజాగా 865 మంది కరోనా తో మరణించగా మొత్తం మృతుల సంఖ్య 5,01,979 కి చేరింది.

పెరిగన పాజిటివిటీ రేటు..

కాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,13, 246 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కరనా రికవరీల సంఖ్య 4,04,61,148 కు చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివిటి రేటు 96.90 శాతంగా ఉంది. అదేవిధంగా రోజువారీ పాజిటివిటీ రేటు 7.42 శాతానికి చేరుకుంది. ఇక కొవిడ్‌ కట్టడికి దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 1,69,46,26,697 మందికి కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే నిన్న ఒక్క రోజే 45,10,770 టీకా డోసులను వేసినట్లు పేర్కొంది.

ఆ రాష్ట్రంలో పెరుగుతున్న కొవిడ్‌ మరణాలు..

కాగా గుజరాత్‌ రాష్ట్రంలో కొవిడ్‌ మరణాలు పెరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. దీనికి ఒమిక్రాన్‌ వైరస్‌ కారణమని నిపుణులు చెబుతున్నారు. గత నెలలో గుజరాత్‌ రాష్ట్రంలో సుమారు 550 కరోనా మరణాలు సంభవించాయని, గత 8 రోజుల్లో కూడా మరణాలు భారీగానే నమోదయ్యాయని అక్కడి అధికారులు చెబుతున్నారు. అయితే మృతుల్లో ఎక్కువ మంది కిడ్నీ, కాలేయ తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారేనని, అలాగే ఆస్పత్రికి ఆలస్యంగా రావడం వల్ల మరణాల సంఖ్య పెరుగుతోందని చెబుతున్నారు.

Also Read:Samantha: పెద్దయ్యాక సమంత అవుతానంటున్న చిన్నారి.. వీడియో

Latha Mangeshkar: గాయని లతా మంగేష్కర్ కన్నుమూత.. భారతరత్న పురస్కార గ్రహీత గానకోకిల అరుదైన చిత్రాలు..

Abu Dhabi: లక్ తెచ్చిన లాటరీ టికెట్.. లక్కీడ్రాలో 44 కోట్ల ప్రైజ్ మనీ గెలుచుకున్న కేరళ యువతి..