దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్ లేని కారణంగా ఇంకా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయిగడిచిన 24 గంటల్లో కొత్తగా 23,068 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 336 మంది మంది మృతి చెందారు. ఇప్పటి వరకు దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,01,46,846కు చేరంది. ఇక మొత్తం మరణాల సంఖ్య 1,47,092కు చేరింది. అలాగే మొత్తం పాజిటివ్ కేసుల్లో 2,81,919 యాక్టివ్ కేసులుండగా, తాజాగా 24,661 మంది కోలుకోగా, ఇప్పటి వరకు మొత్తం 97,17,834 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 95.77 శాతం ఉండగా ఉంది. నిన్న ఒక్క రోజు 9,97,396 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. ఇక మహారాష్ట్రలో అత్యధికంగా 19,09,951 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 49,058 మరణాలు సంభవించాయి. అలాగే కర్ణాటకలో ఇప్పటి వరకు 9,13,483, ఏపీలో 8,80,075, తమిళనాడులో 8,11,115, కేరళలో 7,26,687, ఢిల్లీలో 6,20,681 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.