దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతంది. కొద్ది రోజులుగా కొత్త కేసుల్లో తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ.. మరణాల సంఖ్య మాత్రం ఆందోళనకరంగా ఉంది. నాలుగు వేలకు పైగానే మరణాలు ఉండటం జనాల్లో భయాన్ని పెంచుతుంది. మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం 18,69,223 మందికి కరోనా టెస్టులు చేయగా నిర్వహించగా..2,63,533 మందికి వైరస్ సోకినట్లు తేలింది. వరసగా ఐదో రోజు కొత్త కేసుల సంఖ్యలో డ్రాప్ కనిపించింది. పలు రాష్ట్రాల్లో అమలు చేస్తోన్న లాక్ డౌన్ దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మరణాలు మాత్రం రికార్డ్ రేంజ్‌లో నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే 4,329 మంది చనిపోయారు. ఇప్పటివరకు నమోదైన టాప్ మరణాలు ఇవే. మే 11న 4,205 మంది చనిపోయారు.
కొత్త కేసుల తగ్గుదల ఉండటంతో.. యాక్టివ్ కేసుల విషయంలో కూడా తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం 33,53,765 మంది కరోనాతో చికిత్స పొందుతుండగా.. యాక్టివ్ కేసుల రేటు 13.29 శాతంగా ఉంది. సోమవారం 4,22,436 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. మొత్తంగా 2,15,96,512 మంది వైరస్‌ను జయించారు. రికవరీ రేటు 85.60 శాతంగా ఉంది. మహారాష్ట్రలో కరోనా కల్లోలం కొనసాగుతుంది. సోమవారం అక్కడ భారీగా కరోనా మరణాలు నమోదయ్యాయి. ఒక్కరోజులో వెయ్యిమంది చనిపోయారు. మార్చి 30 తరవాత కొత్త కేసులు సంఖ్య 30 వేల దిగువకు పడిపోయినప్పటికీ..మృతుల సంఖ్య ప్రభుత్వాన్ని టెన్షన్ పెడుతుంది. తాజాగా అక్కడ 26,616 మందికి కరోనా సోకింది.
Also Read: హ్యాట్సాఫ్ కానిస్టేబుల్ గారు.. చిన్నారుల ఆకలి తీర్చిన మసనున్న పోలీస్