మల్లేపల్లికి చెందిన తబ్లీఘీ జమాత్‌ సభ్యుడు అరెస్ట్.. ఏం చేశాడంటే..?

| Edited By:

Apr 13, 2020 | 9:22 PM

హైదరాబాద్‌లోని మల్లేపల్లికి చెందిన తబ్లీఘీ జమాత్ సభ్యుడు మహమ్మద్ ఇక్రమ్ అలీని హబీబ్‌ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా.. పదుల సంఖ్యలో విదేశీయులకు మల్లేపల్లిలోని మర్కజ్‌కు సంబంధించిన ప్రదేశంలో షెల్టర్‌ ఇచ్చి.. కరోనా వ్యాప్తికి కారణమయ్యారన్న ఆరోపణలపై ఇతనిపై కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉంటే హబీబ్ నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల మొదటివారంలో.. తొమ్మిది మంది తబ్లీఘీ జమాత్‌ సభ్యులతో పాటు.. ఆ […]

మల్లేపల్లికి చెందిన తబ్లీఘీ జమాత్‌ సభ్యుడు అరెస్ట్.. ఏం చేశాడంటే..?
Follow us on

హైదరాబాద్‌లోని మల్లేపల్లికి చెందిన తబ్లీఘీ జమాత్ సభ్యుడు మహమ్మద్ ఇక్రమ్ అలీని హబీబ్‌ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా.. పదుల సంఖ్యలో విదేశీయులకు మల్లేపల్లిలోని మర్కజ్‌కు సంబంధించిన ప్రదేశంలో షెల్టర్‌ ఇచ్చి.. కరోనా వ్యాప్తికి కారణమయ్యారన్న ఆరోపణలపై ఇతనిపై కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉంటే హబీబ్ నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల మొదటివారంలో.. తొమ్మిది మంది తబ్లీఘీ జమాత్‌ సభ్యులతో పాటు.. ఆ సంస్థకు చెందిన అధ్యక్షుడిని ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ సెంటర్‌కి తరలించారు. ప్రస్తుతం మల్లేపల్లిలో విదేశీయులకు షెల్టర్‌ ఇచ్చిన మర్కజ్ లీడర్‌ నివసించే ప్రాంతమంతా.. కంటైన్మెంట్‌జోన్‌గా ఉంది.