తెలంగాణ‌కు కేంద్రం గుడ్‌న్యూస్‌…ఇక కరోనా పరీక్షలు ఇక్కడే..

|

Mar 24, 2020 | 11:27 AM

రాష్ట్రంలో విస్త‌రిస్తోన్న క‌రోనా వైర‌స్ వ‌ణికిస్తోంది. రోజురోజుకూ వైర‌స్ కేసుల సంఖ్య పెరుగుతుండ‌టంతో ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విష‌యంలో మ‌రింత క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్రానికి కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇవాళ్టి నుంచి..Hyderabad coronavirus Corona sample tests Minister Eatala Rajender

తెలంగాణ‌కు కేంద్రం గుడ్‌న్యూస్‌...ఇక కరోనా పరీక్షలు ఇక్కడే..
Follow us on

తెలంగాణ రాష్ట్రంలో విస్త‌రిస్తోన్న క‌రోనా వైర‌స్ వ‌ణికిస్తోంది. రోజురోజుకూ వైర‌స్ కేసుల సంఖ్య పెరుగుతుండ‌టంతో ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విష‌యంలో మ‌రింత క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్రానికి కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇవాళ్టి నుంచి హైద‌రాబాద్‌లోనే క‌రోనా వైర‌స్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు అనుమ‌తి మంజూరు చేసింది.

జీవ శాస్త్రం(లైఫ్‌ సైన్సెస్‌) పరిశోధనల్లో అగ్రస్థానంలో ఉన్న సీసీఎంబీని కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలకు వేదికగా వాడుకోవడానికి అవకాశమివ్వాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే హైదరాబాద్‌లోని సీసీఎంబీ (సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ)లో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు మంగళవారం నుంచి నిర్వహించనున్నారు. పరీక్షల కోసం అత్యాధునికమైన 12 రియల్‌ టైమ్‌ పీసీఆర్‌లను సిద్ధం చేసినట్టు సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌మిశ్రా వెల్ల‌డించారు. కరోనా పరీక్షలను నిర్వహించడానికి 20 మంది నిపుణులను నియమించినట్టు తెలిపారు.

పరీక్షల నిర్వహణకు తమకు కేంద్రం నుంచి లిఖిత పూర్వకంగా అనుమతి లభించిందని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌మిశ్రా తెలిపారు. నేటి నుంచి నమూనాలను పంపితే పరీక్షలను నిర్వహిస్తామని గాంధీ, ఉస్మానియా ఆస్ప‌త్రి వైద్యాధికారులకు సీసీఎంబీ సమాచారమిచ్చింది. రోజుకు 500కుపైగా నమూనాలను పరిశీలించే సామర్థ్యం సీసీఎంబీకి ఉన్నది.