కరోనాపై పోరు.. హైదరాబాద్ సంస్థ ముందడుగు.. కీలక డ్రగ్ తయారీ..!

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాను అడ్డుకట్టవేసే క్రమంలో హైదరాబాద్‌కు చెందిన ఐఐసీటీ ముందడుగు వేసింది.

కరోనాపై పోరు.. హైదరాబాద్ సంస్థ ముందడుగు.. కీలక డ్రగ్ తయారీ..!

Edited By:

Updated on: Apr 30, 2020 | 10:06 PM

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాను అడ్డుకట్టవేసే క్రమంలో హైదరాబాద్‌కు చెందిన ఐఐసీటీ ముందడుగు వేసింది.ఫేవిపిరావీర్ ఔషధ తయారీలో సులభతర, తక్కువ ఖర్చు విధానం ఐఐసీటీ రూపొందించింది. వివిధ రకాల వైరస్‌లను నియంత్రించడంలో ఫేవిపిరావీర్ ప్రభావవంతంగా పనిచేస్తుండగా.. కోవిడ్-19 వైద్యంలోనూ ఈ డ్రగ్ కీలక పాత్ర పోషిస్తోంది.

కాగా కరోనా వైద్యానికి 25 రకాల ఔషధాలను సీఎస్ఐఆర్ ప్రతిపాదించగా..  అందులో ఫేవిపిరావీర్ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. సాధారణ ఫ్లూ జ్వరాలకు ఫేవిపిరావీర్ ను వినియోగిస్తుంటారు. ఈ ఔషధాన్ని జపాన్‌కు చెందిన ఫ్యుజీఫిల్మ్ తయామా కెమికల్స్ కంపెనీ తయారుచేస్తోంది. ఇక ఇప్పుడు హైదరాబాద్ ఐఐసీటీ ఆవిష్కరణతో చవకగా ఫేవిపిరావీర్ తయారయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read This Story Also: జగన్ నిర్ణయం.. మంత్రి గౌతమ్ రెడ్డికి మరో కీలక శాఖ