జగన్ నిర్ణయం.. మంత్రి గౌతమ్ రెడ్డికి మరో కీలక శాఖ

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి మరో కీలక శాఖను కేటాయిస్తూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

జగన్ నిర్ణయం.. మంత్రి గౌతమ్ రెడ్డికి మరో కీలక శాఖ
Follow us

| Edited By:

Updated on: Apr 30, 2020 | 9:42 PM

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి మరో కీలక శాఖను కేటాయిస్తూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ తదితర శాఖలను నిర్వహిస్తున్న మేకపాటికి.. తాజాగా పెట్టుబడులు, మౌళిక వసతుల శాఖను కేటాయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా నెల్లూరుకు చెందిన మేకపాటి కుటుంబానికి వైఎస్ కుటుంబంతో ఎప్పటినుంచో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక జగన్‌కు సన్నిహితుడుగా ఉండే మేకపాటి గౌతమ్‌రెడ్డి 2014 ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అలాగే 2019లో రెండో సారి కూడా అదే నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ తదితర శాఖలను గౌతమ్ రెడ్డికి అప్పగించారు. ఆ శాఖలను ఆయన సమర్థవంతంగా నిర్వహిస్తుండటంతో తాజాగా పెట్టుబడులు, మౌలిక వసతులశాఖను అప్పగించారు.

Read This Story Also: బన్నీ-ఎన్టీఆర్‌లతో మల్టీస్టారర్‌.. కథాంశం కూడా చెప్పేసిన డైరెక్టర్..!