Immunity Power Check: దేశంలో కరోనా కల్లోలం నెమ్మదించిన వేళ.. ప్రజల నిర్లక్ష్య ధోరణి ఈరోజు కరోనా సెకండ్ వేవ్ ఇలా వ్యాప్తి చెందడానికి కారణం అంటూ కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. రోజు రోజుకీ తీవ్ర రూపం దాల్చింది.కరోనా మహమ్మారి అయితే ఈ వైరస్ రోగనిరోధక శక్తి ఎక్కువ ఉన్నారిపై తక్కువగాను.. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారిపై ఎక్కువగాను ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణు చెబుతున్నారు . ఈ నేపథ్యంలో మనం రోగనిరోధక శక్తిని పెంచుకవాటం ఎలా.. అసలు మన వంట్లో రోగనిరోధక శక్తి ఉందా లేదా అనే విషయాల గురించి తెలుసుకుందాం..
మీరు తరచుగా జలుబు, స్కిన్ రాషెష్ వంటి సమస్యలతో ఇబ్బందిపడుతుంటే… మీకు రోగనిరోధక శక్తి తగినంత లేదని అర్ధం చేసుకోవాలి. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న వ్యక్తులకు వాతావరణం మారినప్పుడల్లా ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇక కొంతమందికి కళ్ల కింద నల్లని వలయాలు, ఉదయం లేవగానే బద్దకంగా అనిపించడం,,, రోజంతా శక్తి లేనట్లుగా ఉండడం, దేనిపైనా దృష్టి పెట్టలేకపోవడం, చిరాకుగా అనిపిస్తుండడం, చిన్న పనికే బాగా అలసిపోయినట్లు అవడం.. వంటివన్నీ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని చెప్పేందుకు లక్షణాలు. ఈ లక్షణాలు ఉన్నవారు కరోనా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండలని హెచ్చరిస్తున్నారు.
ఇక రోగ నిరోధక శక్తి ఉన్నవారికి మందులు అవసరం లేకుండా నయమవుతుందని..రోగనిరోధక వ్యవస్థ బ్యాక్టీరియా, వైరస్‌లపై పోరాడుతూ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తి ఉంటే వైరస్‌తో పోరాడటమే కాదు జలుబు, దగ్గు వంటివి అంతగా ప్రభావం చూపించవు. అందుకని మనం రోజువారీ తీసుకునే ఆహారంలో రోగనిరోధక శక్తిని పెంచేవి చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా విటమిన్ సి ఉండే నారింజ, నిమ్మకాయలు రోగనిరోధక శక్తిని పెంచుతాయని తెలిపారు. వేసవిలో పెరుగు తినడం వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పెరుగులో విటమిన్ డి ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బ్రకోలీ, కివి వంటివి కూడా తరచుగా తీసుకుంటుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
Also Read: జాతీయ స్థాయి లాక్‌డౌన్? మరోసారి క్లారిటీ ఇచ్చిన నిర్మలా సీతారామన్.. ఏమన్నారంటే..?
తెలంగాణ సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్.. పర్యవేక్షిస్తున్న వైద్య సిబ్బంది
కరోనా కట్టడికి తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు.. పబ్బులు, మద్యం దుకాణాల ఆంక్షలపై ఆరా..!
SriRama Navami 2021: ఈ ఏడాది శ్రీరామనవమి ఎప్పుడు వచ్చిందంటే .. నవమికి చేయాల్సిన పూజలు పాటించాల్సిన పద్దతి..!