ఒకరి నుంచి 11 మందికి.. వనస్థలిపురంలో కేసులు ఎలా పెరిగాయంటే..!

| Edited By:

May 04, 2020 | 12:32 PM

హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో మూడు కుటుంబాలకు చెందిన 11 మందికి కరోనా రావడం స్థానికంగా కలకలం రేపింది. దానికి తోడు ఈ మూడు కుటుంబాలు వనస్థలిపురం, సరూర్‌నగర్ సమీప కాలనీల్లో నూనెలు, పాలు, కిరాణా కూరగాయలు అమ్మేవారు కావడంతో

ఒకరి నుంచి 11 మందికి.. వనస్థలిపురంలో కేసులు ఎలా పెరిగాయంటే..!
Follow us on

హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో మూడు కుటుంబాలకు చెందిన 11 మందికి కరోనా రావడం స్థానికంగా కలకలం రేపింది. దానికి తోడు ఈ మూడు కుటుంబాలు వనస్థలిపురం, సరూర్‌నగర్ సమీప కాలనీల్లో నూనెలు, పాలు, కిరాణా కూరగాయలు అమ్మేవారు కావడంతో.. వారి వద్ద సరుకులు కొనుగోలు చేసిన దాదాపు 169 మందిని క్వారంటైన్‌లో ఉంచారు. మిగిలిన వారిని గుర్తించే పనిలో ఇప్పుడు అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో వనస్థలిపురంలోని 8 కాలనీలకు పూర్తిగా రాకపోకలు బంద్ చేశారు. కంటైన్మెంట్ జోన్ల పరిధిలోని నివాసాల పరిసరాల్లో కఠిన ఆంక్షలు విధించారు.

అయితే కొద్ది రోజుల క్రితం సరూర్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తికి జ్వరం లక్షణాలు ఉండగా.. ఆ వ్యక్తి వనస్థలిపురంలోని తన సోదరుని ఇంటికి వెళ్లారు. ఆ క్రమంలో అతడికి జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. ఇక ఆయన భార్య, కుమారుడికి సైతం వైరస్ సోకింది. ఇదిలా ఉంటే ఈలోపు అతడి తండ్రి వనస్థలిపురంలో స్నానాలగదిలో జారీ పడి చనిపోయారు. ఆ వ్యక్తికి జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. వనస్థలిపురంలోనే ఉండే అతడి రెండో కుమారుడు సైతం కరోనాతో మూడు రోజుల క్రితం చనిపోయాడు. దీంతో ఆయన కుటుంబంలోని మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే ఎస్‌కేడీనగర్‌లో ఉంటున్న వృద్ధుడి కుమార్తె, ఆమె కుమారుడికి సైతం కరోనా సోకింది. ఇలా వనస్థలిపురంలో కరోనా కేసులు ఎక్కువయ్యాయి. ఇక కరోనా వైరస్‌తో చనిపోయిన తండ్రీకొడుకులు కిరాణా దుకాణం ఉండగా.. దాదాపు 300 మంది వరకు వీరి వద్ద నిత్యం సరుకులు కొనుగోలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో వారివద్ద నిత్యావసర సరుకులు కొన్న అందరి వివరాలు సేకరించే పనిలో అధికారులు తలమునకలై ఉన్నారు.

Read This Story Also: లాక్‌డౌన్‌ ఎఫెక్ట్.. గంగపాలు కానున్న లక్షల లీటర్ల బీరు.. 700 కోట్ల మద్యం కూడా..!