మ్యాంగో ఐస్‌క్రీమ్ తయారు చేసిన విజయ్..

| Edited By:

Apr 25, 2020 | 3:06 PM

నిద్ర లేచి, తన పనులు తానే చేసుకుంటూ, వాటర్ బాటిల్స్‌ను నింపుతూ, మ్యాంగో ఐస్‌క్రీం చేసి తన పేరెంట్స్‌కు ఇచ్చాడు. అలాగే 'ది రియల్ మేన్' అంటూ తన తండ్రిని వీడియోలో..

మ్యాంగో ఐస్‌క్రీమ్ తయారు చేసిన విజయ్..
Follow us on

ప్రస్తుతం టాలీవుడ్ లో ‘బి ది రియల్ మ్యాన్’ ఛాలెంజ్ ట్రెండింగ్‌లో నడుస్తోంది. సెలెబ్రిటీస్ తమ ఇండ్లలోనే ఉంటూ ఇంట్లో వారికి సహాయం చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందులో భాగంగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ.. హీరో విజయ్ దేవరకొండకు ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్‌ను విసిరారు. అందుకు విజయ్ దేవరకొండ స్పందిస్తూ… “నన్ను మా అమ్మ పనులు చెయ్యనివ్వట్లేదు సార్, అయినా సరే మీకోసం ఈ లాక్ డౌన్ సమయంలో ఒక వీడియో చేస్తాను” అన్నారు.

అందులో భాగంగా విజయ్ దేవరకొండ తన స్టైల్లో ఓ డిఫరెంట్‌గా ఈ ఛాలెంజ్‌ను కంప్లీట్ చేశాడు. నిద్ర లేచి, తన పనులు తానే చేసుకుంటూ, వాటర్ బాటిల్స్‌ను నింపుతూ, మ్యాంగో ఐస్‌క్రీం చేసి తన పేరెంట్స్‌కు ఇచ్చాడు. అలాగే ‘ది రియల్ మేన్’ అంటూ తన తండ్రిని వీడియోలో చూపించాడు. సరదాగా వీడియో గేమ్ కూడా ఆడాడు. అంతే కాదు. ఈ లాక్ డౌన్ లో ఏమేం చేయాలో ఫన్నీగా టిప్స్‌ కూడా అందించాడు రౌడీ.

విజయ్ దేవరకొండ చేసిన ఈ వీడియో కొత్తగా ఉండటంతో.. ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి మంచి స్పందన లభించడమే కాకుండా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోను విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ రూపొందించటం విశేషం. విజయ్ ఈ వీడియో పోస్ట్ చేసిన తరువాత కొరటాల శివ స్పందిస్తూ “ఇలానే మంచి పనులు చేస్తూ మీ అమ్మతో నువ్వు మెప్పు పొందాలని కోరుకుంటున్నా” అన్నారు. ఇక మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌ను ఈ ఛాలెంజ్‌కు నామినేట్ చేశాడు విజయ్ దేవర కొండ.

Read More: 

అక్షయ తృతీయ బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయితో బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు!

హైపర్‌ ఆది పెళ్లి డేట్ ఫిక్స్.. అమ్మాయిది ఏ జిల్లా అంటే!

సీఎం కేసీఆర్‌కు ఆర్జీవీ దిమ్మతిరిగే ఛాలెంజ్..