హైదరాబాద్‌లో భారీ వర్షం

|

Jun 18, 2020 | 9:16 PM

హైదరాబాద్‌ను భారీ వర్షం కుదిపేసింది. నగరంలో గురువారం(జూన్ 18) సాయంత్రం నుంచి భారీ వర్షం దంచికొట్టింది. ఖైరతాబాద్‌, బేగంపేట, హయత్‌నగర్‌, రామంతపూర్, దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, కొత్తపేట్‌, సరూర్‌నగర్‌, మీర్‌పేట్‌, ఎల్బీ నగర్‌, కోఠిలలో వర్షం పడుతోంది. పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. ఈదురుగాలుకు కాలనీలలోని చెట్లు విరిగి పడ్డాయి. భారీ వర్షం కారణంగా కొన్ని చోట్ల రోడ్లు జలమయంగా మారాయి. మరోవైపు నైరుతి రుతుపవనాలు ప్రభావంతో తెలంగాణలోని చాలాచోట్ల ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు […]

హైదరాబాద్‌లో భారీ వర్షం
Follow us on

హైదరాబాద్‌ను భారీ వర్షం కుదిపేసింది. నగరంలో గురువారం(జూన్ 18) సాయంత్రం నుంచి భారీ వర్షం దంచికొట్టింది. ఖైరతాబాద్‌, బేగంపేట, హయత్‌నగర్‌, రామంతపూర్, దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, కొత్తపేట్‌, సరూర్‌నగర్‌, మీర్‌పేట్‌, ఎల్బీ నగర్‌, కోఠిలలో వర్షం పడుతోంది. పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. ఈదురుగాలుకు కాలనీలలోని చెట్లు విరిగి పడ్డాయి. భారీ వర్షం కారణంగా కొన్ని చోట్ల రోడ్లు జలమయంగా మారాయి.

మరోవైపు నైరుతి రుతుపవనాలు ప్రభావంతో తెలంగాణలోని చాలాచోట్ల ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలే ఉంటాయంటున్నారు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు. మరోవైపు, గ్రేటర్‌లో రాగల రెండురోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపారు