Black Fungus: బ్లాక్ ఫంగస్ వ్యాపించకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి..

|

May 25, 2021 | 7:39 PM

Black Fungus: ఓ వైపు కరోనా మహమ్మారి హడలెత్తిస్తుంటే.. మరోవైపు బ్లాక్ ఫంగస్ బెంబేలెత్తిస్తోంది. కరోనాను జయించామని సంతోషించే...

Black Fungus: బ్లాక్ ఫంగస్ వ్యాపించకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి..
Black Fungus
Follow us on

Black Fungus: ఓ వైపు కరోనా మహమ్మారి హడలెత్తిస్తుంటే.. మరోవైపు బ్లాక్ ఫంగస్ బెంబేలెత్తిస్తోంది. కరోనాను జయించామని సంతోషించే లోపే.. బ్లాక్ ఫంగస్ రూపంలో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దాంతో బ్లాక్ ఫంగస్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ఫంగస్ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై, వెంటిలేటర్‌పై చికిత్స పొందిన వారికి, స్టెరాయిడ్లు అధిక మోతాదులో తీసుకున్న వారిపై అటాక్ చేస్తుంది. అయితే, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బ్లాక్ ఫంగస్ బారిన పడకుండా ఉండొచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు. నోటిని శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఈ ఫంగస్ వ్యాప్తిని నియంత్రించవచ్చునని వైద్యులు పేర్కొంటున్నారు. మరి బ్లాక్ ఫంగస్‌ వ్యాపించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

1. కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత.. స్టెరాయిడ్లు, ఇతర మందులు నోటిలో బ్యాక్టీరియా, ఫంగస్ పెరగడానికి కారణమవుతాయి. దీనివల్ల సైనస్, లంగ్స్, మెదడుకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతాయి.
2. బ్లాక్ ఫంగస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి రోజుకు రెండు లేదా మూడు సార్లు బ్రష్ చేయాలి. మౌత్ ప్రెషనర్‌ను కూడా వాడాలి.
3. కరోనా నుండి కోలుకున్న తరువాత ఎలాంటి వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండేందుకు నోటి శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
4. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కరోనా రోగులు నెగెటివ్ రిపోర్ట్ వచ్చిన తరువాత ఇంతకాలం వాడిన టూత్ బ్రష్‌ లను మార్చాలి. అలాగే.. తాము వాడే బ్రష్‌ లను కుటుంబ సభ్యుల బ్రష్‌లకు వేరుగా ఉంచాలి. క్రిమినాశక లిక్విడ్‌లతో నోటిని ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలి. టంగ్ క్లీనర్‌తో నాలుకను క్లీన్ చేసుకోవాలి.

Also read:

Unique Health ID: కరోనా టీకా సర్టిఫికేట్ లో కనిపిస్తున్న ప్రత్యేక హెల్త్ఐడీ.. ఇది ఏమిటి? దీనివలన ఉపయోగం ఏమిటి?