COVID-19 vaccine: భారత్ ఆపన్నహస్తం.. 76 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ: కేంద్రమంత్రి హర్షవర్ధన్

|

Mar 22, 2021 | 1:04 AM

India COVID-19 vaccination drive: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతంగా కొనసాగిస్తోంది. నిత్యం లక్షలాది మందికి కోవిడ్ వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తోంది. దీంతోపాటు కరోనాపై పోరులో భారత

COVID-19 vaccine: భారత్ ఆపన్నహస్తం.. 76 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ: కేంద్రమంత్రి హర్షవర్ధన్
Harsh Vardhan
Follow us on

India COVID-19 vaccination drive: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతంగా కొనసాగిస్తోంది. నిత్యం లక్షలాది మందికి కోవిడ్ వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తోంది. దీంతోపాటు కరోనాపై పోరులో భారత ప్రభుత్వం తన వంతు పాత్ర పోషిస్తూ ప్రంపచవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటివరకూ ప్రపంచ వ్యాప్తంగా 76 దేశాలకు 6 కోట్లకుపైగా వ్యాక్సిన్‌ డోసులను ఎగుమతి చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 4.6 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ఆదివారం వెల్లడించారు. వ్యాక్సిన్‌ పంపిణీని ప్రజా ఉద్యమంగా మార్చాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పిలుపు మేరకు భారీ స్థాయిలో వ్యాక్సిన్‌ డ్రైవ్‌ను చేపడుతున్నట్లు హర్షవర్ధన్ పేర్కొన్నారు. సంక్షోభంతో దారితీసిన పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగాలని ఆయన శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. భవిష్యత్తు అంచనాలకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు.

ఇదిలాఉంటే.. దేశంలో ప్రతిరోజూ.. దాదాపు 20 లక్షల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేస్తున్నారు. శనివారం ఒక్కరోజే 25 లక్షల 40వేల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇలా ఇప్పటివరకు 4కోట్ల 46 లక్షల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు వెల్లడించింది. ఈ వ్యాక్సినేషన్‌లో 3కోట్ల 71 లక్షల మందికి మొదటి డోసులు అందించగా, 74 లక్షల మందికి రెండు డోసు అందించినట్లు పేర్కొంది. జనవరి 16 నుంచి దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ డ్రైవ్‌లో ముందుగా ఆరోగ్య కార్యకర్తలకు, ఫ్రంట్‌లైన్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఆ తర్వాత మార్చి 1నుంచి 60ఏళ్లు పైబడిన వృద్ధులకు, 45ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి వ్యాక్సిన్‌ను వేస్తున్నారు.

Also Read:

ICAI CA Final Result Jan 2021: సీఏ ఫైనల్, ఫౌండేషన్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌గా ఇలా చెక్ చేసుకోండి

AADHAR CARD: పింఛన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ‘జీవన్ ప్రమాణ్’ కోసం ఆధార్ తప్పనిసరి కాదన్న కేంద్రం