చక్కెరకు ఎంఎస్‌పీ ప్రకటించనున్న కేంద్రం

కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే.. చెరుకు రైతులకు ఉపకరిస్తుందని అంచనా వేస్తోంది. విక్రయ ధరను పెంచడంతో పాటు, కోవిడ్-19 సంక్షోభంలో చిక్కుకున్న చక్కెర పరిశ్రమకు బెయిల్ అవుట్ ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉంది...

చక్కెరకు ఎంఎస్‌పీ ప్రకటించనున్న కేంద్రం
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 19, 2020 | 11:05 AM

చక్కెరకు కనీస విక్రయ ధర(ఎంఎస్‌పీ)ను పెంచే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వాల కోరిక మేరకు ఆహార మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకోనుంది. ఈ క్రమంలో చక్కెర మిల్లర్లకు, రైతులకు సహాయంగా ఉండేందుకు ప్రస్తుతం కిలో చెక్కరకు రూ.31గా ఉన్న ధరను పెంచనున్నట్టు ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుదర్శన్‌ పాండే వెల్లడించారు. చెరుకు రైతులకు మిల్లర్లు రూ.22 వేల కోట్లు బకాయిలను చెల్లించాల్సి ఉన్నది.

కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే.. చెరుకు రైతులకు ఉపకరిస్తుందని అంచనా వేస్తోంది. విక్రయ ధరను పెంచడంతో పాటు, కోవిడ్-19 సంక్షోభంలో చిక్కుకున్న చక్కెర పరిశ్రమకు బెయిల్ అవుట్ ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉంది. దేశంలో అత్యధిగా చక్కెరను ఉత్పత్తి చేసే రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్రా ఈ డిమాండ్ ను తెరమీదికి తీసుకొచ్చాయి.

గత కొంతకాలంగా చెరుకు విక్రయ ధరను పెంచాలని సహకార చక్కెర మిల్లుల ఫెడరేషన్ లిమిటెడ్ డిమాండ్‌ చేస్తున్నది. ఈ డిమాండ్‌ను పరిశీలించిన కేంద్రం.. రైతులు, మిల్లర్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.