AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా కల్లోలం..వైద్యాధికారులకు గవర్నర్ పిలుపు

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. శరవేగంగా పెరిగిపోతున్న వైరస్ పాజిటివ్ సంఖ్య జనం గుండెల్లో దడ పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై వైరస్ విస్తరిస్తున్న పరిస్థితులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.

కరోనా కల్లోలం..వైద్యాధికారులకు గవర్నర్ పిలుపు
Jyothi Gadda
|

Updated on: Jul 06, 2020 | 6:40 PM

Share

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. శరవేగంగా పెరిగిపోతున్న వైరస్ పాజిటివ్ సంఖ్య జనం గుండెల్లో దడ పుట్టిస్తోంది. రోజుకు వెయ్యికి పై చిలుకు నమోదవుతున్న పాజిటివ్ కేసులు, 5కు మించి సంభవిస్తున్న మరణాలు చూసి జనం భయపడిపోతున్నారు. పాజిటివ్ రేటింగ్‌లో తెలంగాణ మహారాష్ట్రను మించి ఉందనే వార్తల నేపథ్యంలో ప్రజల్లో దీనిపై ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై వైరస్ విస్తరిస్తున్న పరిస్థితులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో కరోనా తీవ్రత, ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి తెలుసుకునేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులను రాజ్ భవన్‌కు రావాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చికిత్స విధానంపై గవర్నర్ వివరణ కోరనున్నట్లు తెలుస్తోంది.

కాగా, ఆదివారం తెలంగాణలో 1590 పాజిటివ్ నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. 5290 శాంపిల్స్ ప‌రీక్షించారు. ఈ కేసుల్లో ఒక్క గ్రేట‌ర్‌ హైద‌రాబాద్‌లోనే 1277 మంది ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం క‌రోనా బాధితుల సంఖ్య 23,902కి చేరింది. మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 295కి పెరిగింది. రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసులు 10,904. కాగా, డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 12,703గా నమోదైంది.

Follow Us
జబర్దస్త్ జడ్జెస్ రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా? ఒక్కో ఎపిసోడ్ కోసం
జబర్దస్త్ జడ్జెస్ రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా? ఒక్కో ఎపిసోడ్ కోసం
దుర్గమ్మకు నైవేద్యంగా కొబ్బరి లడ్డూ పెడుతున్నారా?
దుర్గమ్మకు నైవేద్యంగా కొబ్బరి లడ్డూ పెడుతున్నారా?
నమ్మినోడే మోసం చేశాడు.. ఎదురుపడితే నేను చేసే పని అదే..
నమ్మినోడే మోసం చేశాడు.. ఎదురుపడితే నేను చేసే పని అదే..
ఇకపై లైసెన్స్ అంత ఈజీ కాదు భయ్యా.. ఈ టెస్ట్ పాస్ అవ్వకపోతే..
ఇకపై లైసెన్స్ అంత ఈజీ కాదు భయ్యా.. ఈ టెస్ట్ పాస్ అవ్వకపోతే..
మొదటి తరం మహానటి కన్నాంబ గురించి మీకు తెలియని విషయాలు..
మొదటి తరం మహానటి కన్నాంబ గురించి మీకు తెలియని విషయాలు..
IPL 2027లో ధోనీ ఆడతాడా..? తొలిసారి స్పందించిన సీఎస్కే సీఈవో
IPL 2027లో ధోనీ ఆడతాడా..? తొలిసారి స్పందించిన సీఎస్కే సీఈవో
మురళీ మోహన్ చెప్పిన మనీ సేవింగ్ ట్రిక్స్..  లైఫ్ చేంజింగ్ టిప్స్.
మురళీ మోహన్ చెప్పిన మనీ సేవింగ్ ట్రిక్స్..  లైఫ్ చేంజింగ్ టిప్స్.
ధోనికి సాధ్యంకాని ప్రపంచ రికార్డులో బంగ్లా దిగ్గజం..!
ధోనికి సాధ్యంకాని ప్రపంచ రికార్డులో బంగ్లా దిగ్గజం..!
గోరింటలు విరగబూయాలా? ఈ టిప్స్ పాటిస్తే..పండుగ వరకు పూలే పూలు!
గోరింటలు విరగబూయాలా? ఈ టిప్స్ పాటిస్తే..పండుగ వరకు పూలే పూలు!
పురుషులకు కూడా బ్రెస్ట్‌ క్యాన్సర్‌ క్యాన్సర్ వస్తుందా?
పురుషులకు కూడా బ్రెస్ట్‌ క్యాన్సర్‌ క్యాన్సర్ వస్తుందా?