Curfew In Goa: పూర్తి క‌ర్ఫ్యూ దిశ‌గా మ‌రో రాష్ట్రం.. గోవాలో రేప‌టి నుంచి 15 రోజుల పాటు నిబంధ‌న‌లు..

|

May 08, 2021 | 6:03 AM

Curfew In Goa: భార‌త దేశంలో క‌రోనా విల‌య‌తాండ‌వం ఇప్ప‌ట్లో స‌ద్దుమ‌నిగేలా క‌నిపించడం లేదు. రోజురోజుకీ పెరిగిపోతున్న కేసులు, మ‌ర‌ణాల‌తో ఎక్క‌డ చూసినా విషాధ సంఘ‌ట‌న‌లే క‌నిపిస్తున్నాయి. దీంతో...

Curfew In Goa: పూర్తి క‌ర్ఫ్యూ దిశ‌గా మ‌రో రాష్ట్రం.. గోవాలో రేప‌టి నుంచి 15 రోజుల పాటు నిబంధ‌న‌లు..
Curfew In Goa
Follow us on

Curfew In Goa: భార‌త దేశంలో క‌రోనా విల‌య‌తాండ‌వం ఇప్ప‌ట్లో స‌ద్దుమ‌నిగేలా క‌నిపించడం లేదు. రోజురోజుకీ పెరిగిపోతున్న కేసులు, మ‌ర‌ణాల‌తో ఎక్క‌డ చూసినా విషాధ సంఘ‌ట‌న‌లే క‌నిపిస్తున్నాయి. దీంతో క‌రోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌భుత్వాలు రంగంలోకి దిగాయి. ఇందులో భాగంగా ఇప్ప‌టికే కొన్ని రాష్ట్రాల్లో నైట్ క‌ర్ఫ్యూ, పాక్షిక లాక్‌డౌన్‌ను విధిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. తాజాగా ఈ జాబితాలోకి గోవా వ‌చ్చి చేరింది.

క‌రోనా కేసులు విపరీతంగా పెరుగుతోన్న నేప‌థ్యంలో గోవా ప్ర‌భుత్వం రాష్ట్ర‌లో రేప‌టి నుంచి (ఆదివారం) 15 రోజుల పాటు పూర్తి క‌ర్ఫ్యూను విధిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఇక అత్య‌వ‌స‌ర సేవ‌ల‌తో సంబంధం ఉన్న దుకాణాల‌కు మాత్రం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తెరుచుకునే అవ‌కాశం క‌ల్పించారు. వీటితో పాటు ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల మధ్య ‘ఫుడ్‌ హోం డెలివరీ’ సదుపాయం అందుబాటులో ఉంటుందని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ తెలిపారు. ఇదిలా ఉంటే గోవాలో గ‌తంలో నాలుగు రోజులపాటు పూర్తి లాక్‌డౌన్‌ విధించిన విష‌యం తెలిసిందే. క‌రోనా క‌ట్ట‌డికి గోవా ప్ర‌భుత్వం చేస్తోన్న ఈ చ‌ర్య‌లు ఎంత మేర ఫ‌లిస్తాయో చూడాలి.
ఇక ద‌క్షిణాదికి చెందిన మ‌రో రాష్ట్రం క‌ర్ణాట‌క‌లోనూ పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ను విధిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌విష‌యం తెలిసిందే. రాష్ట్రంలో కఠిన ఆంక్షలు విధించినప్పటికీ కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో లాక్‌డౌన్ విధించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప 14 రోజులపాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్ ప్రకటించారు.

Also Read: CoWin app: వ్యాక్సిన్ వేయించుకోవాలంటే.. నాలుగు అంకెల కోడ్ చెప్పాల్సిందే.. ‘కోవిన్’ యాప్‌లో సరికొత్త ఫీచర్

AP Corona Cases: ఏపీలో కరోనా కల్లోలం.. కొత్తగా 73మంది మృతి.. మరో 17,188 మందికి పాజిటివ్

India Covid-19: ఆ 12 రాష్ట్రాల్లోనే కరోనా కేసులు అధికం.. మరికొన్ని రాష్ట్రాల్లో తగ్గుతున్నాయ్.. కేంద్రం