కరోనా కల్లోలం.. 50 లక్షల కేసులకు చేరువలో ‘ప్రపంచం’

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. గ్లోబల్ గా 49 లక్షల వరకు ఈ కేసులు నమోదు కాగా.. 3  లక్షల 23 వేల మంది మరణించారని యుఎస్ లోని జాన్స్ హాప్ కిన్స్ యూనివర్సిటీ తెలిపింది. 17 లక్షల మంది కోలుకున్నారని, ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయని పేర్కొంది. యుఎస్ లో 15 లక్షల మందికి ఈ వైరస్ ఇన్ఫెక్షన్ సోకింది. 91 వేల మంది మృత్యుబాట పట్టారు. జూన్ […]

  • Umakanth Rao
  • Publish Date - 7:23 pm, Wed, 20 May 20
కరోనా కల్లోలం.. 50 లక్షల కేసులకు చేరువలో 'ప్రపంచం'

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. గ్లోబల్ గా 49 లక్షల వరకు ఈ కేసులు నమోదు కాగా.. 3  లక్షల 23 వేల మంది మరణించారని యుఎస్ లోని జాన్స్ హాప్ కిన్స్ యూనివర్సిటీ తెలిపింది. 17 లక్షల మంది కోలుకున్నారని, ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయని పేర్కొంది. యుఎస్ లో 15 లక్షల మందికి ఈ వైరస్ ఇన్ఫెక్షన్ సోకింది. 91 వేల మంది మృత్యుబాట పట్టారు. జూన్ 1నాటికి మృతుల సంఖ్య పది లక్షలకు పెరగవచ్ఛునని అంచనా అని ఈ విశ్వవిద్యాలయం వివరించింది. రష్యాలో మూడు లక్షలకు పైగా, బ్రెజిల్ లో రెండు లక్షల 71 వేలకు పైగా కరోనా కేసులు నమోదైనట్టు ఆయా ప్రభుత్వాలు ప్రకటించాయి. చైనాలో 82,965 కేసులు నమోదు కాగా.. వీటిలో 1708 ఇంపోర్టెడ్ కేసులని, 4,645 మంది రోగులు మృతి చెందారని ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది.

ఇలా ఉండగా కరోనా కేసుల విషయంలో స్వతంత్ర, నిష్పాక్షిక, సమగ్ర దర్యాప్తు జరగాలని, ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తీరుపైనా ఇన్వెస్టిగేషన్ చేపట్టాలని యూరప్, ఆస్ట్రేలియా దేశాలు చేసిన డిమాండు పట్ల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సానుకూలంగా స్పందించింది. ఈ దర్యాప్తును తాము స్వాగతిస్తున్నామని ఈ సంస్థ హెడ్ టెడ్రోస్ ప్రకటించారు.