విజయవాడలో హైటెన్షన్.. నలుగురు వార్డు వాలంటీర్లకు కరోనా..

|

Apr 30, 2020 | 3:54 PM

ఏపీలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉంది. విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు, డాక్టర్లు, ఇంటింటి సర్వే నిర్వహిస్తూ, ప్రజలకు రేషన్, పెన్షన్ అందజేస్తున్న వాలంటీర్లు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా కృష్ణాజిల్లా విజయవాడలో నలుగురు వార్డు వాలంటీర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనితో అధికారులు వారిని క్వారంటైన్‌కు తరలించారు. అటు రెడ్ జోన్‌లో విధులు నిర్వహిస్తున్న రెవిన్యూ ఇన్‌స్పెక్టర్ కూడా వైరస్ […]

విజయవాడలో హైటెన్షన్.. నలుగురు వార్డు వాలంటీర్లకు కరోనా..
Follow us on

ఏపీలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉంది. విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు, డాక్టర్లు, ఇంటింటి సర్వే నిర్వహిస్తూ, ప్రజలకు రేషన్, పెన్షన్ అందజేస్తున్న వాలంటీర్లు సైతం కరోనా బారిన పడుతున్నారు.

తాజాగా కృష్ణాజిల్లా విజయవాడలో నలుగురు వార్డు వాలంటీర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనితో అధికారులు వారిని క్వారంటైన్‌కు తరలించారు. అటు రెడ్ జోన్‌లో విధులు నిర్వహిస్తున్న రెవిన్యూ ఇన్‌స్పెక్టర్ కూడా వైరస్ బారిన పడ్డాడు. కాగా, కృష్ణా జిల్లాలో ఇప్పటివరకు 246 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అత్యధికంగా విజయవాడలోనే కేసులు పెరుగుతుండటంతో అధికారులలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం అక్కడ రెడ్ జోన్లను ఏర్పాటు చేసి పకడ్బందీగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.

Read This: ఇక నుంచి విమానాల్లోనూ ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ టెస్ట్.!